రిలయన్స్ సంచలనం..ఆశాజనక భారతం ..ఆర్ధిక బలోపేతం..!
భారత దేశంలో పేరెన్నికగన్న రిలయన్స్ కంపెనీ అనుకున్నట్టుగానే సంచలనాలకు తెర లేపింది. మొదటి నుంచి ఆసియా ఖండంలో బిజినెస్ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న సదరు కంపెనీ ఏది చేసినా ఓ చరిత్రే. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ, ప్రత్యర్థి కంపెనీల అంచనాలకు అందనంత దూరంలో రిలయన్స్ చుక్కలు చూపిస్తోంది. ఒక్క టెలికం రంగంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. ఒక్క టెలికం రంగమే కాకుండా ఆయిల్ , లాజిస్టిక్స్ , డిజిటల్ టెక్నలాజి , తదితర రంగాలలో ఇప్పటికే ప్రారంభించింది.
ఓ వైపు విదేశీ కంపెనీలు భారీగా రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టాయి. అంతే కాకుండా అమెరికా కంపెనీ తాజాగా రిలయన్స్ టవర్స్ ను కొనుగోలు చేసింది. భారీగా పెట్టుబడులు వచ్చాయి . ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు రిలయన్స్ తన ఖాతాదారులను ప్రసన్నం చేసుకునే దిశగా ఆఫర్లు ప్రకటించింది . టెలికం రంగంలో తన దరిదాపుల్లో ఏ కంపెనీ లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. 18 నెలల్లో రుణ రహిత కంపెనీగా మారుస్తామని ముకేశ్ అంబానీ వెల్లడించారు . భారత దేశ ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ పాత్ర ముఖ్యమైనది. మార్కెట్ సూచీలను ప్రభావితం చేసే పవర్ రిలయన్స్ కు ఉంది.
తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక వాటాదారుల సమావేశం జరిగింది .ఎన్నో విశేషాలకు వేదికగా నిలిచింది. ఎక్కువగా చాలా అంశాలు భారత ఆర్థిక రంగాన్ని మార్చి వేసేవిగా ఉన్నాయి. పెట్రో, కెమికల్ రంగానికే పరిమితం కాకుండా రిటైల్, టెలికం, ఇంటర్నెట్, టెక్స్‌టైల్స్.. ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర కనబరుస్తోంది రిలయన్స్ . మార్చి 2021 నాటికి అప్పుల్లేని కంపెనీగా మారి.. వాటాదారులకు అత్యధిక లాభాలను అంద జేస్తుందని ముఖేశ్ అభయం ఇచ్చారు. నికర రుణ రహిత కంపెనీగా మారేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాం. మరో 18 నెలల్లో ఈ కల సాకారం చేస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని ముకేశ్ అంబానీ చెప్పారు . మొత్తం మీద రిలయన్స్ రాబోయే రోజుల్లో ఏం చేస్తుందనేది మార్కెట్ వర్గాలు అంచనా వేయలేక పోతున్నాయి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి