అవార్డు వద్దన్న అమ్మాయి

ఎవరికైనా 35 లక్షల రూపాయలు వస్తున్నాయంటే చాలు తీసుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ స్వీడిష్ కంట్రీకి చెందిన యువ కెరటం గ్రెటా థంబర్గ్ మాత్రం తనకు డబ్బులు, అవార్డు వద్దని చెప్పేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. గ్రెటాకు అవార్డుతో పాటు 35 లక్షల రూపాయలు బహుమతిగా అందుతాయి. గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మనకిప్పుడు కావాలని కోరారు. సైన్స్ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి అన్నారు. ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా గ్రెటా మాట్లాడారు. పర్యావరణం విషయంలో స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చే సరికి మా...