రారమ్మంటున్న జనం..దిగిరానంటున్న బంగారం
దేశంలో కనీవిని ఎరుగని రీతిలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు కొనలేని స్థితిలోకి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్ రంగంలో నెలకొన్న ప్రతిష్టంభన భారతీయ పసిడి, వెండి, ఆభరణాలు, ఆయిల్ రంగాలపై తీవ్ర ప్రభావితం చూపుతోంది. గత ఏడాది 30 నుంచి 33 వేల రూపాయల మధ్యలో ఉన్న బంగారం ధర ఏడాది ఊహించని రీతిలో పెరిగింది. ఏకంగా 40 వేల రూపాయలను తాకింది. దీంతో వ్యాపారులు, అమ్మకం దారులు, కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.
ఇప్పటికైనా ధరలు తగ్గుతాయని భావించిన కస్టమర్స్ కు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో బంగారం కంటే వెండితో పాటు ప్లాటినం ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అమ్మకాలు ఓ వైపు తగ్గినా మరో వైపు భారీ ఎత్తున ఆభరణాలను తీసి పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం చివరి వరకు పసిడి 10 గ్రాముల ధర 42,000 రూపాయలను తాకుతుందని కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వరల్డ్ మార్కెట్ ప్రధాన కారణమని చెబుతున్నారు.
భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహద పడతాయని అంచనా. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రాను రాను బంగారాన్ని చూడటమే తప్పా కొనే పరిస్థితి లేదని కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా ఊరిస్తూ వచ్చిన బంగారం ఇక సామాన్యులకు అందని ద్రాక్ష కానుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి