అసాధారణ నిర్ణయాలు..అద్భుత విజయాలు
ఏపీలో ముఖ్యమంత్రిగా సందింటి జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాను ఎన్నికల సందర్బంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడ్డారు. అదుపు తప్పిన పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. సామాన్యులకు అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన నవ రత్నాలను ప్రకటించారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో విద్య, వైద్యం, ఉపాధి కల్పన తన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అభివృద్ధి వైపు అడుగులు వేసేలా పావులు కదుపుతున్నారు.
తన రాష్ట్ర అభివృద్ధిలో కోసం తెలంగాణ రాష్ట్రంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టారు. వైద్య రంగంలో సంస్కరణలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమలుకు కమిటీని నియమిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. కో చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సుజాతారావును నియమించారు. వివిధ విభాగాలకు చెందిన 10 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.
రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చేందుకు సీఎం ఒక కమిటీని నియమించారు. వైద్య విద్య డైరెక్టర్, ఏపీవీవీపీ కమిషనర్, మాజీ వీసీ ఐవీ రావు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఎండీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా రంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో జగన్ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తాము గుర్తించిన అంశాలపై కమిటీ చైర్మన్ ఎన్.బాలకృష్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమ్మఒడి, నాడు..నేడు కార్యక్రమాలపై సంస్కరణల కమిటీ ప్రశంసలు కురిపించడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి