ప్రేమ ఫిక్స్ ..పెళ్లి సక్సెస్
వేద గుర్తున్నారా. తెలుగు సినిమాలో నటించినవి కొన్ని సినిమాలే అయినా ఆమె మంచి నటిగా పేరు పొందారు. ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు వేద. అయితే సినిమాల్లో లక్ బాగుండాలనే ఉద్దేశం తో అర్చనగా మార్చుకున్నారు. వచ్చే నెల నవంబర్ 13 న ఓ ప్రముఖ వ్యాపారితో వివాహం ఖరారైంది. ఈ మేరకు తన మ్యారేజీ విషయాన్ని హీరోయిన్ అర్చన సోషల్ మీడియా ద్వారా తానే వెల్లడించింది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపార వేత్త జగదీశ్ భక్త వత్సలంతో ఇటీవల అర్చన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక జగదీశ్, అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
2004లో నేను అనే సినిమాతో తెరంగేట్రం చేసింది అర్చన. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం లో పలు సినిమాలలో నటించింది. జనాన్ని మెస్మరైజ్ చేసింది. అయితే సరైన హిట్ లేక పోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కు కోలేక పోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగ పడలేదు.
తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్ర కవచ ధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్ షో లకు అర్చన న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. కాగా తాజాగా వివాహంతో ఆమె రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించ బోతోంది. తన అందంతో ఆకట్టుకున్న ఈ నటి రియల్ లైఫ్ లో సక్సెస్ కావాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి