ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం ..ధర్మాసనం ధర్మాగ్రహం
ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నది అవగతమవుతోందని రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం చేసింది. సమ్మెపై ఇరు పక్షాల మధ్య కోర్టులో వాడి వేడిగా వాదనలు కొనసాగాయి. ఆర్టీసీ అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని మండి పడింది. ఉప ఎన్నిక సందర్బంగా 100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వంపై ధర్మాసనం సెటైర్లు వేసింది. ఎండీ విచారణకు ఒక్క సారైనా హాజరయ్యారా అని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ను నిలదీసింది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ఏజీ కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం..రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించింది. విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి 4253 కోట్లు చెల్లించామని వివరించారు.
దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమన లేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. సమర్పించే నివేదికలో అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం నిలదీసింది. 47 కోట్లు వెంటనే ఇవ్వ లేమని కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో కోర్టు ఒప్పు లేదు. హుజూర్‌నగర్‌లో 100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి 47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు, బలహీన వర్గాలు ప్రయాణం చెయ్యాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమ్మెపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెప్తూనే, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారని కోర్టు గుర్తు చేసింది. 75 శాతం బస్సులు తిరుగు తున్నాయని ప్రభుత్వ కోర్టుకు తెలపగా..ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని హైకోర్టు పేర్కొంది. కాగా ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన సభకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సరూర్ నగర్ లో కాకుండా, ఎక్కడ అనుమతి ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం మీద కోర్టు సర్కార్ పై సీరియస్ గా స్పందించింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి