వసూళ్ళలో హౌస్ ఫుల్


బాలీవుడ్ లో హౌస్ ఫుల్ - 4 సినిమా వసూళ్లలో సరికొత్త రికార్డు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఈ సినిమాలో నటించారు. విడుదలైన అన్ని థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా బాక్సాఫీస్‌ వసూళ్లలో మాత్రం ఈ మూవీ సత్తా చాటుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో నే 90 కోట్లు రాబట్టింది. మొత్తంగా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. హౌస్‌ఫుల్‌ 4 ఒక్క సోమవారం రోజున 34.56 కోట్లు వసూలు చెడింది. దేశ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 87.78 కోట్లు వసూలు చేసింది.

సాజిద్‌ నదియా వాలా నిర్మాణ భాగస్వామ్యంతో ఫర్హాద్‌ సంజీ దర్శకత్వంలో హౌస్‌ఫుల్‌ 4 సినిమా తీశారు. ఇందులో ఖిలాడీ అక్షయ్‌తో పాటు కృతి సనన్‌, బాబీ డియోల్‌, కృతి కర్బంద, రితీష్‌ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా నటించారు. తమ నటనతో మెప్పించారు. సారా బొదినార్ కథ రాశారు ఈ మూవీకి. సుదీప్ ఛటర్జీ దీనికి సినిమాటోగ్రఫీ అందించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. 145 నిమిషాల నిడివి కలిగిన హౌస్ ఫుల్ ఆద్యంతమూ వినోదాత్మకంగా అలరిస్తోంది.

సినిమాను 75 కోట్లు పెట్టి తీశారు. ఇప్పటికే ఖర్చు పెట్టినదంతా వచ్చేసింది. అంతకు రెట్టింపు వసూళ్లు రావొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టి సిరీస్ కంపెనీ ఆడియో విడుదల చేసింది. దానికి డబ్బులు భారీగా వచ్చాయి. సోహైల్ సేన్, ఫర్హాద్ సంజయ్, సందీప్ శిరోద్కర్ లు హౌస్ ఫుల్ - 4 సినిమాకు సంగీతం అందించారు. ఫర్హాద్ సంజయ్, సమీర్ అంజాన్, వాయు లు పాటలు రాశారు. మొత్తం మీద అక్షయ్ కుమార్ కు ఈ ఏడాది సంతోషాన్ని కలిగించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!