ఇండియాకే అమెజాన్ ప్రయారిటీ
అమెరికా దిగ్గజ కంపెనీ అమెజాన్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డది. ఇప్పటికే ఏషియన్ కాంటినెంట్ లో బిగ్గెస్ట్ మార్కెట్ కలిగిన భారత్ పైనే పలు దేశాల వ్యాపారులు, కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ కామర్స్ కంపెనీల్లో అమెజాన్, ఫ్లిప్ కార్, స్నాప్ డీల్, తదితర కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి. ఇదే సమయంలో సామాన్యులు, మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంది. దీంతో వీరి అభిరుచులు, కోరికలకు అనుగుణంగా తమ వ్యాపారాలను విస్తరించే పనిలో పడ్డాయి. ఆయా కస్టమర్స్ కు ప్రయారిటీ ఇస్తూ బిజినెస్ చేస్తున్నాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తోంది.
ఆ దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా 4,400 కోట్లను ఇక్కడి మార్కెట్లో పెట్టుబడిగా పెట్టనుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించిన తాజా సమాచారం మేరకు.. అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్ డాట్ కామ్ ఇంక్ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్ట నున్నాయి. రైట్స్ ఇష్యూ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయ నున్నట్లు తెలుస్తోంది. ఏ విభాగంలో ఎంత పెట్టుబడి చేరుకోనుందనే విషయానికి వస్తే.
అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ 3,400 కోట్లు, అమెజాన్ పే ఇండియా 900 కోట్లు, అమెజాన్ రిటైల్ ఇండియా172.5 కోట్లను అందుకోనున్నాయి. ఇప్పటికే వివిధ విభాగాల్లో 2018–19 కాలంలో 7,000 కోట్ల పెట్టుబడి పెట్టిన అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలతో పెరిగిన పోటీ కారణంగా భారత్‌లో తన ఇన్వెస్ట్ ను మరింత పెంచనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. మొత్తం మీద దిగ్గజ కంపెనీలకు ఇండియా ఓ వరంగా మారిందని చెప్పక తప్పదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి