!..ప్రేమ లోగిలి..లోకమే వాకిలి ..!

బతుకు వెలిగి పోవాలన్నా..ఆనందం వెళ్లి విరియాలన్నా..గుండెల్లోంచి గుండెల్లోకి చూపులు ప్రసరించాలన్నా ప్రేమ కావాల్సిందే. నువ్వు నేను కలుసుకున్నప్పుడు..కొత్తగా పరిచయం చేసుకున్నప్పుడు..ప్రయాణం చేస్తున్నప్పుడు...కిటికీ పక్కన ఒకరికొకరం కళ్లల్లోకి ప్రవహించినప్పుడు ..శరీరాలు తెలియకుండానే కదలడం ప్రారంభిస్తాయి. అపుడంతా ఈ ప్రపంచం ఎంత అద్భుతమైనదోనని అనిపిస్తుంది. మేఘాలు తేలిపోతున్నపుడు..అలలు అలలుగా ఆలోచనలు వెంబడిస్తున్నప్పుడు..మళ్లీ మళ్లీ జ్ఞాపకాలు పూల మొక్కల్లా అగుపిస్తాయి. ప్రేమ లేకుండా వుండలేం. ఆశించకుండా ..కోరుకోకుండా..చేతకాదు. ఇదే ప్రేమంటే..నీ కోసం పరితపిస్తున్నప్పుడు..నీ కోసం ఆక్రోశిస్తున్నప్పుడు..నీ అడుగుల సవ్వడి..ఆ ప్రేమతనపు దారుల్లో నడుస్తున్నప్పుడు..గాల్లో తేలినట్టు అనిపిస్తుంది..ఇలా మొదలై అలా ముగుస్తుందని చెప్పలేం. ఎంత చెప్పినా తక్కువే..ఈ లోకం వెలిగిపోతోంది..ఈ జగత్తు ప్రకాశసిస్తోంది..నువ్వు లేకుండా నేనుండలేను..నీ సాహచర్యం లేకుండా బతకడం చేత కాదు..ఏక కాలంలో ..ఏకాంతంలో హృదయాలు కలుసుకున్నప్పుడు ప్రపంచం వద్...