!..ప్రేమ లోగిలి..లోకమే వాకిలి ..!
బతుకు వెలిగి పోవాలన్నా..ఆనందం వెళ్లి విరియాలన్నా..గుండెల్లోంచి గుండెల్లోకి చూపులు ప్రసరించాలన్నా ప్రేమ కావాల్సిందే. నువ్వు నేను కలుసుకున్నప్పుడు..కొత్తగా పరిచయం చేసుకున్నప్పుడు..ప్రయాణం చేస్తున్నప్పుడు...కిటికీ పక్కన ఒకరికొకరం కళ్లల్లోకి ప్రవహించినప్పుడు ..శరీరాలు తెలియకుండానే కదలడం ప్రారంభిస్తాయి. అపుడంతా ఈ ప్రపంచం ఎంత అద్భుతమైనదోనని అనిపిస్తుంది. మేఘాలు తేలిపోతున్నపుడు..అలలు అలలుగా ఆలోచనలు వెంబడిస్తున్నప్పుడు..మళ్లీ మళ్లీ జ్ఞాపకాలు పూల మొక్కల్లా అగుపిస్తాయి. ప్రేమ లేకుండా వుండలేం. ఆశించకుండా ..కోరుకోకుండా..చేతకాదు. ఇదే ప్రేమంటే..నీ కోసం పరితపిస్తున్నప్పుడు..నీ కోసం ఆక్రోశిస్తున్నప్పుడు..నీ అడుగుల సవ్వడి..ఆ ప్రేమతనపు దారుల్లో నడుస్తున్నప్పుడు..గాల్లో తేలినట్టు అనిపిస్తుంది..ఇలా మొదలై అలా ముగుస్తుందని చెప్పలేం.
ఎంత చెప్పినా తక్కువే..ఈ లోకం వెలిగిపోతోంది..ఈ జగత్తు ప్రకాశసిస్తోంది..నువ్వు లేకుండా నేనుండలేను..నీ సాహచర్యం లేకుండా బతకడం చేత కాదు..ఏక కాలంలో ..ఏకాంతంలో హృదయాలు కలుసుకున్నప్పుడు ప్రపంచం వద్దనిపిస్తుంది..లైఫ్ ఎప్పటికప్పుడు సంతోషపు కెరటాలను తాకుతుంది. ఒకరి సమక్షంలో ఇంకొకరం వున్నా..విడిచి వుండలేని పరిస్థితి వస్తే..ఎంత హాయిగా వుంటుందో..ఎవరికి ఎరుక..అంతా ప్రేమ పక్షులే..ప్రతి పక్షికి రెక్కలు వున్నట్లే..మనకూ స్పందించే..కన్నీళ్లు తెప్పించే స్వచ్ఛమైన మనసులు లేవా..బతకాలంటే ఏం కావాలి..ఎలాంటి ఖర్చు లేని..ప్రేమ వుందిగా..ఈ ప్రపంచం ఇలా నడుస్తూ వుండడానికి చోదక శక్తి మనీ కాదు.
.ఐటీ కాదు..డాలర్ అంతకంటే కాదు..కేవలం ఒకరిని విడిచి వుండలేని..స్వార్థాన్ని తొలగిస్తుంది..ద్వేషం నుంచి రక్షిస్తుంది..ఆత్మీయతను కలుగ చేస్తుంది..గుండెల్లో కరుకుదనాన్ని పక్కన పెట్టేస్తుంది ..ప్రేమ..అందుకే ప్రేమంటే ..రెండు శరరీరాలు కాదు..ఆత్మల సంగమం..అన్నం లేకుండా వుండగలం..కాసిన్ని నీళ్లు తాగి బతకగలం..కానీ ప్రేమించకుండా వుండలేం..ప్రేమన్నది లేకపోతే..దానికి దూరమైతే..ఇంకేముంది..అంతా చీకటే ..విషాదంలో ఉన్నామా..కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నామా..సంపాదించిందంతా పోగొట్టుకున్నామా..మనం అనుకున్న వాళ్లు..పలకరించడం లేదా..పోతే పోనీ..ఈ ప్రపంచం వద్దనుకున్నా..వెలి వేసినా..ఫీల్ కావాల్సిన పనేలేదు..మళ్లీ మళ్లీ ఓటమి పలకరించినా సరే..మన దగ్గర ఏమీ లేక పోవొచ్చు ..కానీ అంతులేని ఆత్మ విశ్వాసం..అంతకంటే నన్ను..నిన్ను ఏకం చేసే అంతులేని శక్తివంతమైన ..ప్రేమ ..వుందిగా..ఇదొక్కటే నిన్ను నన్ను నడిపిస్తోంది..ఆలోచించేలా చేస్తోంది...జీవితాన్ని రాగరంజితం చేస్తుంది.
ఏమీ లేకపోయినా ..లేక అన్నీ వున్నా..గుండెల్లో కాసింత ప్రేమ అన్నది లేకపోతే..ఇంకెందుకు ఉండడం. ఒక్కసారి మిమ్మల్ని ప్రేమించు కోండి..అద్భుతాలు చేసే శక్తి మనలోకి చేరిపోతుంది..దానికున్న పవర్ అలాంటిది. తనువంతా తలపుల్లో ..తలాపున ప్రవహించేలా చేస్తుంది..ప్రతి రోజుకు ప్రత్యేకత వుంటుంది..కానీ ప్రేమన్నది విశ్వవ్యాప్తం కదా..దానికి ఒక రోజు ఏమిటి..? ..కళ్లు ..కులంతో పనిలేదు..మతాలు..అసలే వద్దు..కావాల్సిందల్లా ప్రేమించడమే..ప్రేమను పంచడమే..ప్రేమే జీవితమనుకుంటూ సాగి పోవడమే..ఏదో ఒకరోజు ప్రేమ కోసం పరితపించాల్సిందే..మన నుంచి ప్రేమ దూరమై పోతే..ఇంకేముంది..మనుషులం కాకుండా పోతాం..మన నుంచి మనం వేరై పోతాం..మనకు అడవుల్లో ఉన్న ఆ జీవాలకు తేడా ఏమిటి..?
కాసుల వెంట పడితే..డాలర్లను ప్రేమిస్తే ఏమొస్తుంది..కావాల్సినన్ని వస్తువులు దక్కవచ్చేమో కానీ..ప్రియురాలి ఒడి..రెప రెప లాడే ముంగురులు..మల్లె మొగ్గల్లాంటి కళ్లు..పడిపోయేంతలా ప్రేరేపించే ఆ కళ్లు..మరిచిపోలేని అనుభూతిని ..అనుభవాన్ని ఇచ్చే కౌగిలింత..పదే పదే గుర్తుకు తీసుకువచ్చే గిలిగింతలు..ఎన్ని డబ్బులు ఇస్తే వస్తాయి..ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరం..ఒక్కసారే వచ్చే ఈ ప్రయాణంలో ప్రేమ ఒక్కటే మిగిలిపోయేది..మనుషులుగా అద్భుతమైన విజయాలు..అంతులేని ఆస్తులు అక్కర్లేదు..కావాల్సిందల్లా ప్రేమతనం కోల్పోకుండా వుండటమే..పోతే పోయేది ఏముంది..బాస్ ..ప్రేమిద్దాం..పంచుకుందాం..ప్రయాణం చేద్దాం..! ఓ పుస్తకం..ఓ పాట..వెచ్చని కాఫీ..టీ..కిటికీ ..ఇవి వుంటె చాలదు..కాసింత సంతోషానికి..కావాల్సినంత ఆనందం పొందటానికి..ప్రేమ వర్ధిల్లాలి..లోకపు వాకిట ప్రేమతనపు సింధూరాన్ని అద్దాలి..సమస్త జీవాల్లో..మనుషుల్లో ప్రేమ ప్రవహించాలి..దీపమై వెలుగుతూనే వుండాలి..కడదాకా..చావు పలకరించే దాకా..మట్టిలో కలిసి పోయే దాకా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి