ఈ కామర్స్ లో నువ్వా నేనా - చైనా కంపెనీల హవా

ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ బిజినెస్ రాకెట్ కంటే వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ , తదితర కంపెనీలు తమ హవా కొనసాగిస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్స్ విషయంలో చైనా దేశానికి చెందిన కంపెనీలు టాప్ రేంజ్ లో అమ్ముడు పోతున్నాయి. అటు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా తమ వ్యాపారాలను స్టార్ట్ చేస్తూ ..గణనీయమైన ఆదాయాన్ని గడుస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన అమెజాన్ ఈ కామర్స్ సెక్టార్ లో మొదటి ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక చైనాకు చెందిన షావోమి మొబైల్ కంపెనీ ప్రతి గ్రామానికి విస్తరించింది. అతి తక్కువ ఖర్చులో , ప్రతి సామాన్యమైన కుటుంబం వాడుకునేలా అన్ని సౌకర్యాలతో కూడిన స్మార్ట్ ఫోన్స్ ను తయారు చేస్తోంది. ఆపిల్, సామ్ సంగ్ కంపెనీలకు ధీటుగా షావో మీ అమ్మకాలు పెరిగాయి. ఈ కామర్స్, ఇంటర్నెట్, టెక్నాలజీ , రిటైల్, ఇన్వెస్ట్ మెంట్ రంగాలలో చైనాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఆలీబాబా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ కామర్స్ రంగంలోకి ఎంటర్ కావాలని నిర్ణయం తీసుకుంది. తన అనుబంధంగా ఉన్న యూసీ వెబ్ ద్వారా ఈ ఏడాదే ఈ కామర్స్ బిజినెస్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. విన్నూతంగా ...