విమెన్స్ క్రికెట్ లో ఆమె ఓ ధృవతార
భారతీయ మహిళల క్రికెట్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగిన క్రీడాకారిణి గా పేరు తెచ్చుకున్న మిథాలీ రాజ్ అనూహ్యంగా తాను టీ -20 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె త్వరలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలుగుతుందని వార్తలు గుప్పుమన్నాయి. తన ఆట తీరుతో వరల్డ్ వైడ్ గా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించే ప్లేయర్స్ లలో ఆమె మొదటి ప్లేస్ లో నిలుస్తారు. అటు వన్డేల్లోనూ ఇటు టెస్టుల్లోనూ మిథాలీ రాజ్ పరుగుల వరద పారించింది. టాప్ రేంజ్ క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచింది.
2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేశారు. అంతే కాకుండా 93 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 45.50 సగటుతో 2776 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 20 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 114 నాటౌట్. టెస్టులలో 8 మ్యాచ్‌లు ఆడి 52 సగటుతో 522 పరుగులు సాధించింది.
ఇందులో ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు. 2003లో ఆమెకు అర్జున అవార్డు పురస్కారం లభించింది. ప్రస్తుతం ఆమె రైల్వే లో జాబ్ చేస్తున్నారు. టీ 20 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో మిథాలీ రాజ్ స్థానంలో ముంబైకి చెందిన చిచ్చర పిడుగు షెఫాలీ వర్మకు చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. మొత్తం మీద మిథాలీ రాజ్ మహిళా లోకానికి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. ఎందరో వర్ధమాన మహిళా క్రికెటర్లు ఈ రంగంలోకి రావడానికి జంకుతున్న సమయంలో ఆమె ఎంటర్ అయ్యారు. ఈ హైదరాబాదీ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ . ఎన్నో రికార్డులు స్వంతం చేసుకున్న మిథాలీ ఎప్పుడూ పాజిటివ్ దృక్పథం కలిగి ఉంటారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి