ధర్మాసనం ఆగ్రహం ..చిదంబరంకు కష్టకాలం..!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు..శాశ్వత శత్రువులు ఉండరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాలం సహకరించనప్పుడు ఏదైనా జరగ వచ్చు. అందుకు తాజా ఉదాహరణ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం. మంత్రిగా పనిచేసిన సమయంలో బీజేపీ అగ్ర నేత , ప్రస్తుత హోమ్ శాఖా మంత్రిగా ఉన్న అమిత్ చంద్ర షా ను షొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో అరెస్ట్ చేయించారు. జైలుకు పంపించారు. అదే పగను పెంచుకున్న అమిత్ షా ఇప్పుడు తనకు పవర్ రావడంతో దెబ్బకు దెబ్బ తీశారు. అక్రమ ఆస్తుల నేరారోపణలు ఎదుర్కుంటున్న చిదంబరం ను కోలుకోలేకుండా చేశారు.
తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనీ కోరినా, సుప్రీం కోర్ట్ అనుమతి ఇవ్వలేదు. ఆర్ధిక నేరగాళ్లు బయట ఉంటే ప్రమాదమని కోర్టు పేర్కొంది. అయినా కేంద్రంలో కొలువు తీరిన మోడీ అండ్ షా మాత్రం పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. చిదంబరం అరెస్ట్ పై రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , సోనియా గాంధీ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా వీరిద్దరూ నవ్వారు కానీ ఒక్క కామెంట్ చేయలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కామెంట్స్ మాత్రమే చేశారు. మరో వైపు వచ్చే ఎన్నికల నాటికి దేశంలో బీజేపీ తప్ప మరో పార్టీ ఉండరాదనే టార్గెట్ తో కాషాయ దళం , మోడీ అండ్ షా కంకణం కట్టుకున్నారు. ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ , జేడీఎస్ సర్కార్ ను కూల దోశారు.
తెలంగాణాలో కేసీఆర్ కు పక్కలో బల్లెంలా ఫైర్ బాండ్ గా పేరొందిన సౌందర్య రాజన్ ను తీసుకు వచ్చారు. ఇక చిదంబరం ను తీహార్ జైలుకు పంపించారు. తీహార్ జైలుకు వద్దంటూ ఆయన చేసిన విన్నపాన్ని ధర్మాసనం ఒప్పుకోలేదు. ఆర్ధిక నేరాలు సమాజానికి ముప్పు కలుగ చేస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. తనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు పంపాలని చిదంబరం విన్నవించారు. అయినా కోర్టు కనికరించ లేదు. ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరం శక్తివంతమైన నాయకుడని, ఆయనకు బెయిల్ ఇస్తే , స్వేచ్ఛగా వదిలి వేస్తే కేసును ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. చిదంబరం తరపున వాదించిన కపిల్ సిబల్ మాత్రం ఒప్పుకోలేదు. ఎక్కడా ప్రభావితం చేసినట్లు సీబీఐ నిరూపించలేక పోయిందని వాదించారు. దీనిని కోర్టు అంగీకరించ లేదు. దీంతో జైలు కు వెళ్లడం ఖాయమై పోయింది. ఒకప్పుడు ఒక వెలుగువెలిగిన ఈ రాజకీయ నాయకుడు ఇప్పుడు జైలు ఊచలు లెక్క బెట్టడం వింత కాక మరేమిటి. రాబోయే రోజుల్లో మరెంత మంది కాంగ్రెస్ నాయకులను జైలుకు పంపిస్తారో వేచి చూడాలి .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి