ఈ కామర్స్ లో నువ్వా నేనా - చైనా కంపెనీల హవా

ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ బిజినెస్ రాకెట్ కంటే వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ , తదితర కంపెనీలు తమ హవా కొనసాగిస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్స్ విషయంలో చైనా దేశానికి చెందిన కంపెనీలు టాప్ రేంజ్ లో అమ్ముడు పోతున్నాయి. అటు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా తమ వ్యాపారాలను స్టార్ట్ చేస్తూ ..గణనీయమైన ఆదాయాన్ని గడుస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన అమెజాన్ ఈ కామర్స్ సెక్టార్ లో మొదటి ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక చైనాకు చెందిన షావోమి మొబైల్ కంపెనీ ప్రతి గ్రామానికి విస్తరించింది. అతి తక్కువ ఖర్చులో , ప్రతి సామాన్యమైన కుటుంబం వాడుకునేలా అన్ని సౌకర్యాలతో కూడిన స్మార్ట్ ఫోన్స్ ను తయారు చేస్తోంది. ఆపిల్, సామ్ సంగ్ కంపెనీలకు ధీటుగా షావో మీ అమ్మకాలు పెరిగాయి.

ఈ కామర్స్,  ఇంటర్నెట్, టెక్నాలజీ , రిటైల్, ఇన్వెస్ట్ మెంట్ రంగాలలో చైనాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఆలీబాబా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ కామర్స్ రంగంలోకి ఎంటర్ కావాలని నిర్ణయం తీసుకుంది. తన అనుబంధంగా ఉన్న యూసీ వెబ్ ద్వారా ఈ ఏడాదే ఈ కామర్స్ బిజినెస్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. విన్నూతంగా , విభిన్నమైన రీతిలో ఇండియాలోకి ప్రవేశించాలని పావులు కదుపుతోంది. ఆ దిశగా కృషి జరుగుతోంది. భారత దేశంలో ఇప్పటికే ఈ కామర్స్ రంగంలో ఉన్న కంపెనీలు పే టీఎం , స్నాప్ డీల్ లలో వాటా కలిగి ఉన్నది చైనా ఆలీబాబా కంపెనీ. ఈ రంగంలోకి ఎంటర్ అయితే ఇతర కంపెనీలకు ధీటుగా ఎదగ వచ్చని భావిస్తోంది. బిజినెస్ మాడల్ పే టీఎం , స్నాప్ డీల్ లపై ప్రభావం చూపదని అంటోంది. అయితే ఆలీబాబాకు చెందిన రీసెర్చ్ అండ్ వింగ్ టీమ్ సీరియస్ గా ఎఫర్ట్ పెడుతోంది.

ఇండియాలో అనుగుణమైన విభాగాన్ని ఎంచు కోవాలని, అప్పుడే సక్సెస్ సాధించేందుకు వీలు కలుగుతుందని భావిస్తోంది. ఆన్ లైన్ లో మూవీ టికెట్స్ కు భారీ డిమాండ్ ఉంటోంది. మొదట దీనిలోనే ప్రవేశించాలని తలపిస్తోంది. యూసీ వెబ్ కు చెందిన యూసీ అప్లికేషన్ వేగంగా విస్తరించింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 110 కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని ఆలీబాబా వెల్లడించింది. ఇండియాలో కూడా భారీగా డౌన్లోడ్ చేసు కోవడం విస్తు పోయేలా చేసింది. ఈ ఒక్క చైనా కంపెనీ రంగ ప్రవేశం చేస్తే ఇతర భారతీయ ఈ కామర్స్ రంగంలో మరింత పోటీ పెరగడం మాత్రం ఖాయం. తాజాగా అమెజాన్ తో పాటు ఇండియన్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ కూడా ఈ కామర్స్ రంగంలోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యింది. ఇక వార్ మొదలైనట్లే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!