పోస్ట్‌లు

నవంబర్ 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆర్టీసీకి లైన్ క్లియర్..విలీనానికి జగన్ ఒకే

చిత్రం
తాను మాటా మీద నిలబడే వ్యక్తినని మరోసారి ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు. మాట ఇచ్చినట్టు గానే ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖ గా మార్చేందుకు మొదటి అడుగు పడింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ, వీసీ నేతృత్వంలో విజయవాడ ఆర్టీసీ బస్‌ భవన్‌ లో జరిగిన పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీలో పని చేస్తున్న ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి కార్మికుడు వరకు మొత్తం 52 వేల మందిని పీటీడీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సిబ్బంది పదవీ విరమణ వయస్సుని 60కి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికీ పాలక మండలి పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీలో మెడికల్‌ అన్‌ ఫిట్‌ అయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న 2015 నాటి సర్క్యులర్‌ను రద్దు చేసినట్లు సమాచారం. అదే విధంగా గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చే ఇంక్రిమెంట్‌ను శాశ్వతం...

ఇండియా పటిష్టం..బంగ్లాకు ప్రమాదం

చిత్రం
సౌత్ ఆఫ్రికాతో అన్ని ఫార్మాట్ లలో దుమ్ము రేపిన టీమిండియా జట్టు మరో రికార్డు ను క్రియేట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. తాజాగా బాంగ్లాదేశ్ తో భారత జట్టు ఆడబోతోంది. ఇప్పటికే జట్లను ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. బంగ్లా, ఇండియా ల మధ్య జరిగిన మ్యాచుల్లో మన జట్టుదే పైచేయిగా ఉంది. వన్డేల్లో అప్పుడొకటి... ఇప్పుడొకటి అన్నట్లు వేళ్ల మీద లెక్కపెట్టే విజయాలు సాధించిందేమో కానీ, టెస్టులు, టి20ల్లో అయితే టీమిండియాకు ఎదురేలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా ప్రతీ విభాగంలోనూ ప్రత్యర్థి కంటే భారతే బలంగా ఉండటంతో ఇంటా బయటా బంగ్లాపై టీమిండియానే విజయం సాధిస్తూ వచ్చింది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్, అనుభవజ్ఞులైన పేస్‌ దళం, నాణ్యమైన స్పిన్నర్లు ఇలా తుది 11 మంది దాకా భారత్‌ ప్రత్యర్థి కంటే ఎంతో దుర్బేధ్యమైంది. ప్రస్తుత జట్టులో విశ్రాంతి వల్ల రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడే అందు బాటులో లేడు. కానీ అతడి వెన్నంటే నిలిచిన యావత్‌ జట్టంతా అస్త్ర శస్త్రాలతో రెడీగా ఉంది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా సమరానికి సై అంటోంది. ఇదిలా ఉండగా భారత్‌తో సిరీస్‌కు సమాయత్తం అవుత...

ప్రమాదంలో సమాచారం

చిత్రం
టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రపంచం చిన్నదై పోయింది. కానీ అదే టెక్నాలజీ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. అంత కంటే ఎక్కువగా బురిడీ కొట్టిస్తోంది. ప్రతి ఒక్కరు దానిని వాడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో మంచి మాటేమిటో కానీ కీడే ఎక్కువగా జరుగుతోంది. కోట్లాది మంది ప్రతి నిత్యం స్మార్ట్ ఫోన్స్ తోనే గడిపేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా. అంతా అందులోనే లీనమై పోతున్నారు. ఇదే సమయంలో హ్యాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువై పోతున్నారు. ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు తమ ప్రయత్నాలు మాను కోవడం లేదు. ఆయా కంపెనీలు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఏదో ఒక రూపంలో వైరస్ లను ఇంట్రడ్యూజ్ చేస్తూ జనానికి, కంట్రీస్ కు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి గూఢచర్యం నెరిపిన వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా ఆయా వ్యక్తుల వాట్సాప్‌ ఖాతాల్లో ఎలాంటి సమాచారం మార్పిడి అవుతుందో నిఘా పెట్టారని ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ సంస్థ తాజాగా సంచలన విషయాలు బయట పెట్టింది.పెగ...

అమెరికాకు డ్రాగన్ షాక్

చిత్రం
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాశించాలని ఉవ్విల్లూరుతున్న అమెరికాకు కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చింది డ్రాగన్. అటు మార్కెట్ లో ఇటు టెక్నాలజీలో టాప్ రేంజ్ లో కొసనసగుతోది చైనా కంట్రీ. ఇందులో భాగంగా ఇప్పటికే యూఎస్ కు చెందిన పలు దిగ్గజ కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. స్మార్ట్ మొబైల్స్ తయారీలో వరల్డ్ లో మూడో ప్లేస్ లో నిలిచింది డ్రాగన్ కు చెందిన షావో మీ మొబైల్ కంపెనీ. ఇదిలా ఉండగా టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికాం సేవలకు శ్రీకారం చుట్టింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు ఈ సర్వీసులు ఒకే రోజున ప్రారంభించాయి. బీజింగ్, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్‌ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి అంటే 18 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అటు పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్‌ కూడా ఇదే స్థాయి టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ...

బంగారు కొండ మన దేవరకొండ

చిత్రం
సినిమా రంగం అంటేనే ఓ జూదం. అదో అంతులేని మాయాజాలం. ఇక్కడ ఉన్నన్ని రాజ కీయాలు, ఈర్ష్య ద్వేషాలు ఇంకెక్కడా ఉండవు. హీరో, హీరోయిన్స్ కు ఇగోలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ఎవరి మీదనైనా సెటైర్స్ వేస్తే ఇక వారి పని అయి పోయినట్లే. వాళ్ళ అవకాశాలకు గండి పడినట్లే. అయితే పాలమూరు జిల్లాకు చెందిన డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం వేరే వెరీ స్పెషల్. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే తనకంటూ ఓ ఇమేజ్ ను, బ్రాండ్ ను స్వంతం చేసుకున్నాడు. తనకూ మనసు అనేది వుందని నిరూపించాడు. ఎవ్వరైనా తమ గురించి విమర్శలు చేస్తే తట్టుకోలేరు. వారితో మాట్లాడరు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తనను టార్గెట్ చేసి, తీవ్ర విమర్శలు గుప్పించిన యాంకర్, నటి అనసూయను క్షమించాడు. అవేమీ మనసులో పెట్టుకోకుండా ఏకంగా తాను నిర్మించిన సినిమాలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించింది. తాను పక్కా ప్రొఫెషనల్‌ అని నిరూపించారు విజయ్. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో నటించిన అతడిపై గతంలో అనసూయ ట్విటర్‌లో కామెంట్స్ చేసింది. దీని గురించి అడిగినప్పుడు విజయ్ ఇలా స్పందించారు. క్షమించే స్వభావం ఉన్న వ్యక్తిని నేను. మా సినిమా కోసం అనసూయను ఎ...

ఢిల్లీలోనే టీ-20

చిత్రం
 ఢిల్లీ నగరాన్ని కాలుష్యం పీడిస్తున్నప్పటికీ షెడ్యూలు ప్రకారం తొలి టి20 అక్కడే జరుగుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. భవిష్యత్తులో దీపావళి తర్వాత ఢిల్లీ వేదికపై మ్యాచ్‌లు జరగ కుండా చూసుకుంటామని చెప్పాడు. న్యూఢిల్లీలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మొదటి టి20 జరుగనున్న సంగతి తెలిసిందే. అంతా పూర్తయ్యాక ఆఖర్లో మార్పులంటే కుదరదు అని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఢిల్లీ మ్యాచ్‌ కోసం టికెట్ల విక్రయం, నిర్వహణ ఏర్పాట్లన్నీ జరిగి పోయాయి. కాబట్టి మ్యాచ్‌ను రద్దు చేయడం అసాధ్యం. అయితే భవిష్యత్తులో ఉత్తర భారత వేదికలపై మ్యాచ్‌లు లేకుండా చూసుకుంటాం. దీనిపై మరింత కసరత్తు చేస్తాం. ఢిల్లీతో పాటు హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని వేదికలకు మ్యాచ్‌లు కేటాయించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం అని గంగూలీ అన్నాడు. ఉత్తర భారత్‌లో ఎప్పుడూ ఎదురయ్యే సమస్యే ఇదని, మ్యాచ్‌ రోజు కల్లా పరిస్థితుల్లో మార్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు దాదా చెప్పాడు. భారత తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ విపరీతమైన వాయు కాలుష్యంతో తన కెలాంటి సమస్య లేదన్నాడు. బంగ్లా ఆటగాళ్లు మాస్క్‌ ధరించి నె...

రాహుల్ తో పాటే రవిశాస్త్రి

చిత్రం
దాదా అంటేనే దూకుడు. ఎవ్వరి మాటా వినడు. కానీ ఎవ్వరు చెప్పినా వింటాడు. ఆటను కెరీర్ గా కాకుండా పూర్తి ప్రొఫెషనల్ గా చూసే ఈ మాజీ ఆటగాడు వెరీ స్పెషల్.  క్రికెటర్ గా, మాజీ టీమిండియా సారధిగా, కన్సల్టెంట్ గా, కామెంటేటర్ గా, ఇలా ఏ ఫార్మాట్ లో పని చేసినా దానికి 100 శాతం న్యాయం చేశాడు దాదా. అయితే మొదటి నుంచీ దాదాకు, భారత జట్టు కోచ్ రవిశాస్త్రి మధ్య మాటలు లేవు. అయినా ఎవ్వరి పట్లా కోపాన్ని కలిగి ఉండని ఈ మాజీ ఆటగాడు ఏది చేసినా అది దేశ ప్రయోజనం కోసమే ఉంటుంది. ఎప్పుడైతే బిసిసిఐ కి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడా, సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు. తాజాగా రవిశాస్త్రిని పూర్తిగా వాడు కోవాలని స్పష్టం చేశాడు. బెంగళూర్ లో ఉన్న రాహుల్ ద్రావిడ్ ను కలిశాడు. క్రికెట్ భవిశ్యత్తుపై సమాలోచనలు చేశాడు. ద్రవిడ్‌ పర్యవేక్షణలో ఎన్‌సీఏను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో ఉన్న హై ఫెర్ఫామెన్స్‌ సెంటర్‌ తరహా కేంద్రాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రిని మరో రకంగా కూడా వాడు...

ఎవరికి వారే ఎమునా తీరే

చిత్రం
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడినా ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. బీజేపీ, శివసేన పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. ట్రబుల్ షూటర్ చంద్ర షా రంగంలోకి దిగినా ఈ రోజు వరకు ఇరు పార్టీల అధినేతల మధ్య స్నేహం చిగురించ లేదు. ఎవరికి వారే పట్టు వీడడం లేదు. దీంతో మరాఠాలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంకో అయిదు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోతే రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్ ఉందంటూ బీజేపీ నేత, ఆర్థిక మంత్రి ముంగంతి వార్‌ జోశ్యం చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని తెలిపారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వలేదని. బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని వ్యాఖ్యానించారు. మా కూటమి ఫెవికాల్‌ కన్నా, అంబుజా సిమెంట్‌ కన్నా దృఢమైనది అని వ్యాఖ్యానించారు. మరో వైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్...

టీ సాట్ కు పురస్కారం..శైలేష్ కు గౌరవం

చిత్రం
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రాంపురం శైలేష్ రెడ్డి జగమెరిగిన బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్. స్పెషల్ కరెస్పాండెంట్ గా ప్రారంభమైన కెరీర్ సీఈఓ స్థాయికి చేరుకునేలా చేసింది. నిబద్దత కలిగిన వ్యక్తిగా ప్రారంభమైన జీవితం ఒక వ్యవస్థగా మారేలా చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో శైలేష్ రెడ్డిది విస్మరించలేని పాత్ర ఉన్నది. పోరాటాలకు పెట్టింది పేరైన ఉస్మానియాయా యూనివర్సిటీలో చదువుకున్నారు. జర్నలిజంలో ప్రత్యేక అనుభవాన్ని గడించారు. ఇదే సయమంలో రామోజీరావు ఆధ్వర్యంలోని న్యూస్ టైం ఇంగ్లిష్ పత్రికలో స్పెషల్ కరెస్పాండెంట్ గా జాయిన్ అయ్యాడు. ఢిల్లీలో పని చేశాడు. మొదటి నుంచి ఏ పనిని చేపట్టినా దానిని నిబద్దతతో సక్సెస్ చేసేందుకు కృషి చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో శైలేష్ లోని స్పార్క్, టాలెంట్ ను గుర్తించిన రామోజీ రావు ఈటివి లో అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచారు. తనను తాను కమిటెడ్ జర్నలిస్టుగా పిలుచుకునేలా చేశారు. స్పెషల్ స్టోరీస్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఇచ్చాడు. దీంతో ఆయన పనితీరుకు అరుదైన అవకాశం లభించింది. శైలేష్ ను తలుపు తట్టింది. ఇండియాలో అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన జీ...

ఐటీలో కాగ్నిజెంట్ కలకలం

చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఓ వైపు టెక్నాలజీ మారుతోంది. కొత్తగా వస్తున్న మార్పులను గమనించక పోతే కొత్త ఉద్యోగాల కల్పనా మాటేమిటో కానీ, ఉన్న ఉగ్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. అన్ని దిగ్గజ కంపెనీలు ఎలా వదిలేసి కోవాలని ఆలోచిస్తున్నాయి. ఐటీ కంపెనీలలో టాప్ పొజిషన్ లో ఉన్న కాగ్నిజెంట్ కంపెనీ ఏకంగా 7 వేల ఉద్యోగాల కోత పెట్టింది. ఈ కంపెనీ అమెరికా దేశానిది. ఈ కంపెనీ తీసుకున్న డిసిషన్ దెబ్బకు ఐటీ ప్రోసెషనల్స్ అబ్బా అంటున్నారు. వచ్చే కొన్ని నెలల్లో 12 వేల మంది సిబ్బందిని తొలగించడానికి సిద్ధమవుతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించు కోవడంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని ఉన్నతాధికారి ఒకరు సంకేతాలిచ్చారు. కాగా, సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి గాను సంస్థ 497 మిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని గడించింది. అంత క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 477 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే 4.1 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.  ప్రస్తుత సంవత్సరానికి గాను ఆదాయంలో వృద్ధి 4.6 , 4.9 శాతం మధ్యలో ఉంటుందని అవుట్‌ లుక్‌లో పేర్కొంది. ఆదాయం 4.2 శాతం పెరిగి 4.25 బిలియన్...

మెరిసిన హైదరాబాద్..మురిసిన ముంబై

చిత్రం
ఐటీలో టాప్ రేంజ్ లో దూసుకెళుతున్న హైదరాబాద్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలో క్రియేటివిటీ నగరాల లిస్టులో మన భాగ్యనగరం మెరిసింది. తాజగా యునెస్కో ప్రకటించిన లిస్టులో ఆహార విభాగంలో సిటీకి కూడా చోటు దక్కింది. నోరూరించే బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్‌కి నగరం పెట్టింది పేరు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చడానికి మన కేపిటల్ సిటీని ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 66 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు లభించగా, అందులో మన దేశం నుంచి రెండు సిటీస్ ను మాత్రమే ఎంపిక చేశారు. హైదరాబాద్ సిటీని ఫుడ్ విభాగంలో సెలెక్ట్ చేస్తే..ముంబై నగరం సినిమా రంగం నుంచి స్థానం దక్కించు కున్నది.  నగరాన్ని క్రియేటివ్ సిటీల జాబితాలో చేర్చడం పట్ల నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ హబ్ గా ఈ పట్టణం వినుతికెక్కింది. మెట్రో సర్వీసెస్ కూడా వాడుకలోకి వచ్చింది. మన దేశం నుంచి 12 నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఎనిమిది నగరాలు మాత్రమే నియమిత సమయంలో నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులను యునెస్కోకు సమర్పించాయి. పరిశీలనలో హైదరాబాద్, ముంబై, లక్నో, శ్రీనగర్ మరో నాలుగు నగరాలు మాత్ర...

కార్మికుల కోసం కదిలిన జన సేనాని

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. అయినా ప్రభుత్వం నుండి ఇప్పటి దాకా స్పందన రాలేదు. కార్మికులు బెట్టు దిగడం లేదు. ప్రభుత్వం పట్టు వీడడం లేదు. హైకోర్టు చీవాట్లు పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెట్టారు. వీరి న్యాయపరమైన సమస్యల సాధన కోసం చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు మద్దతు పలికాయి. కార్మికుల సమ్మె సకల జనుల ఆందోళనగా మారింది. సంస్థలో పని చేస్తున్న 49 వేల మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సాక్షాత్తు సీఎం ప్రకటించారు. దీంతో తట్టు కోలేని కార్మికులు పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వం కానీ, ఉన్నతాధి కారులు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించిన పాపాన పోలేదు. ఇంకో వైపు ప్రైవేట్ బస్సులు కొనుగోలుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉండగానే ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు విపక్ష నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలిశారు. సమ్మె చేసేందుకు దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని, హైకోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సైతం పూసగుచ్చినట్టు తెలిప...

షారూక్ ఆహ్వానం..అట్లికి అదృష్టం

చిత్రం
 చిన్న వయసులోనే టాప్ రేంజ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న తమిళ డైరెక్టర్ అట్లికి అదృష్టం తలుపు తట్టింది. ఇప్పటికే తాను విజయ్ తో తీసిన బిగిల్ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తూ రికార్డు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రపంచ మంతటా 4000 వేల థియేటర్లలో విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. అన్ని చోట్లా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అట్లికే దక్కుతుంది. అట్లి ఇప్పటి దాకా కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. కానీ ప్రతి చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కోట్లు కురిపించాయి. మొదట్లో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నా, అంతిమంగా బిగిల్ అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. అటు తమిళ్ లో విడుదలైన రెండు సినిమాలు బిగిల్, ఖైదీ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అట్లి లోని టాలెంట్ ఇప్పుడు దేశానికి తెలిసింది. చూస్తే చిన్నోడు..మహా గట్టోడు అని బాలీవుడ్ బాద్ షా నమ్మాడు. ఏకంగా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ ఏడాది అట్లికి ఇదో పెద్ద గిఫ్ట్ అను కోవాలి. చాలా మంది షారుఖ్ ఖాన్ తో సినిమాలు చేయాలని తహ తహ లాడతారు. కానీ ఆ ఒక్క అరుదైన ఛాన్స్ మాత్రం అట్లీని వరి...

కుదరని సయోధ్య..బీజేపీదే మరాఠా

చిత్రం
శివ సేన, బీజేపీల మధ్య ఇంకా సయోధ్య కుదరక ముందే బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకో వైపు బీజేపీ కాకుండా కాంగ్రెసుతో నైనా కలిసి కుర్చీ చేజిక్కించు కునేందుకు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే పావులు కదుపుతున్నారు. ఈ మేరకు అనూహ్యంగా పాలిటిక్స్ మారి పోతున్నాయి. ఇదే సమయంలో శరద్ పవార్ చీఫ్ గా ఉన్న ఎన్సీపీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటింది. అయితే ప్రతిపక్షంలోనే ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లో తాము శివసేనతో చేతులు కలిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు పవార్. అధికార పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య ప్రతిష్టంభన ఓవైపు కొన సాగుతుండగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో బీజేపీ సొంతగానే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫడ్నవీస్‌ మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. కూటమి నుంచి శివసేన తప్పుకున్నా తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే బాధ్యతను పార్...

టైటిల్ ను ముద్దాడేది ఎవ్వరో

చిత్రం
తెలుగు నాట స్టార్ మాటివి పాపులర్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ తో రియాల్టీ షోస్, సీరియల్స్ టెలికాస్ట్ చేస్తూ జనాదరణ చూరగొంటోంది. కొన్ని గంటల్లో బిగ్ బాస్ ముగియనుంది. తెలుగులో మొదటగా బిగ్ బాస్ ను నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ చేయగా, రెండో బిగ్ బాస్ ఎపిసోడ్ ను మరో నటుడు నాని ప్రయోక్తగా ఉన్నారు. మూడో ఎపిసోడ్ బిగ్ బాస్ షో ను పాపులర్ హీరో అక్కినేని నాగార్జున స్టార్ట్ చేశాడు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా వంద రోజులు పూర్తి చేసుకుంది. పార్టిసిపెంట్స్ ఇప్పటి దాకా వినోదాన్ని పంచారు. దీంతో తెలుగు నాట అందరూ బిగ్‌ బాస్‌ జపం చేస్తున్నారు. ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్‌ సమరంలో ఎవరు నెగ్గుతారు. ఎవరు ఏ స్థానానికి పరిమితమై పోతారు అనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు వీకెండ్స్‌లో సమాధానం దొరక నుండగా, ఇప్పటి నుంచే జనాలు టీవీలకు అతుక్కు పోయారు. ఇక శ్రీముఖి, రాహుల్‌ సిప్లి గంజ్‌, అలీ రెజా, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌ టాప్‌ 5లో చోటు దక్కించు కున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్‌లో చాలా వెనుకబడి పోయా...