బంగారు కొండ మన దేవరకొండ


సినిమా రంగం అంటేనే ఓ జూదం. అదో అంతులేని మాయాజాలం. ఇక్కడ ఉన్నన్ని రాజ కీయాలు, ఈర్ష్య ద్వేషాలు ఇంకెక్కడా ఉండవు. హీరో, హీరోయిన్స్ కు ఇగోలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ఎవరి మీదనైనా సెటైర్స్ వేస్తే ఇక వారి పని అయి పోయినట్లే. వాళ్ళ అవకాశాలకు గండి పడినట్లే. అయితే పాలమూరు జిల్లాకు చెందిన డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం వేరే వెరీ స్పెషల్. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే తనకంటూ ఓ ఇమేజ్ ను, బ్రాండ్ ను స్వంతం చేసుకున్నాడు. తనకూ మనసు అనేది వుందని నిరూపించాడు. ఎవ్వరైనా తమ గురించి విమర్శలు చేస్తే తట్టుకోలేరు. వారితో మాట్లాడరు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తనను టార్గెట్ చేసి, తీవ్ర విమర్శలు గుప్పించిన యాంకర్, నటి అనసూయను క్షమించాడు.

అవేమీ మనసులో పెట్టుకోకుండా ఏకంగా తాను నిర్మించిన సినిమాలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించింది. తాను పక్కా ప్రొఫెషనల్‌ అని నిరూపించారు విజయ్. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో నటించిన అతడిపై గతంలో అనసూయ ట్విటర్‌లో కామెంట్స్ చేసింది. దీని గురించి అడిగినప్పుడు విజయ్ ఇలా స్పందించారు. క్షమించే స్వభావం ఉన్న వ్యక్తిని నేను. మా సినిమా కోసం అనసూయను ఎంపిక చేసింది దర్శకుడే. ఆమె అయితేనే ఆ పాత్రకు సరి పోతారని చెప్పాడు. వ్యక్తిగత వివాదాల కంటే పని ముఖ్యం. ఒక వేళ నేనే ఈ సినిమాకు దర్శకత్వం చేసుంటే ఆమెను తీసుకునేవాడినో, కాదో చెప్పలేను. నేను దర్శకత్వం చేయలేదు కాబట్టి ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ జోక్యం చేసుకోలేదు. దర్శకుడి ఇష్ట ప్రకారమే నటీనటుల ఎంపిక జరిగింది.

షూటింగ్‌ జరుగుతుండగా ఒక్కసారి కూడా నేను సెట్‌కు వెళ్లలేదు. మా సినిమాలో నటించడానికి అనసూయ అంగీకరించడం సంతోషం కలిగింది. తన పాత్రలో చాలా బాగా నటించింది. షామీర్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా దర్శకుడు అడిగినవన్నీ సమకూర్చాను అని దేవరకొండ చెప్పాడు. ఆయన నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’. సినిమా విడుడలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హీరోగా ఇందులో నటించాడు. సో..దేవరకొండ నటుడే కాదు మనసున్నోడినని నిరూపించాడు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!