ఢిల్లీలోనే టీ-20

 ఢిల్లీ నగరాన్ని కాలుష్యం పీడిస్తున్నప్పటికీ షెడ్యూలు ప్రకారం తొలి టి20 అక్కడే జరుగుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. భవిష్యత్తులో దీపావళి తర్వాత ఢిల్లీ వేదికపై మ్యాచ్‌లు జరగ కుండా చూసుకుంటామని చెప్పాడు. న్యూఢిల్లీలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మొదటి టి20 జరుగనున్న సంగతి తెలిసిందే. అంతా పూర్తయ్యాక ఆఖర్లో మార్పులంటే కుదరదు అని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఢిల్లీ మ్యాచ్‌ కోసం టికెట్ల విక్రయం, నిర్వహణ ఏర్పాట్లన్నీ జరిగి పోయాయి.

కాబట్టి మ్యాచ్‌ను రద్దు చేయడం అసాధ్యం. అయితే భవిష్యత్తులో ఉత్తర భారత వేదికలపై మ్యాచ్‌లు లేకుండా చూసుకుంటాం. దీనిపై మరింత కసరత్తు చేస్తాం. ఢిల్లీతో పాటు హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని వేదికలకు మ్యాచ్‌లు కేటాయించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం అని గంగూలీ అన్నాడు. ఉత్తర భారత్‌లో ఎప్పుడూ ఎదురయ్యే సమస్యే ఇదని, మ్యాచ్‌ రోజు కల్లా పరిస్థితుల్లో మార్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు దాదా చెప్పాడు.

భారత తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ విపరీతమైన వాయు కాలుష్యంతో తన కెలాంటి సమస్య లేదన్నాడు. బంగ్లా ఆటగాళ్లు మాస్క్‌ ధరించి నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు. లిటన్‌ దాస్‌ కాసేపు మాస్క్‌తో కనిపించినప్పటికీ తర్వాత బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌లో మాత్రం మాస్క్‌ తీసి ఆడాడు. మొత్తం మీద టీ-20 టోర్నీ స్టార్ట్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. ఇండియా అంటేనే క్రికెట్, క్రికెట్ అంటేనే భారత్. అంతగా ఈ ఆటతో మమేకమయ్యారు. కొన్ని రోజుల పాటు అభిమానులకు పండుగ అన్నమాట. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!