ఐటీలో కాగ్నిజెంట్ కలకలం


ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఓ వైపు టెక్నాలజీ మారుతోంది. కొత్తగా వస్తున్న మార్పులను గమనించక పోతే కొత్త ఉద్యోగాల కల్పనా మాటేమిటో కానీ, ఉన్న ఉగ్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. అన్ని దిగ్గజ కంపెనీలు ఎలా వదిలేసి కోవాలని ఆలోచిస్తున్నాయి. ఐటీ కంపెనీలలో టాప్ పొజిషన్ లో ఉన్న కాగ్నిజెంట్ కంపెనీ ఏకంగా 7 వేల ఉద్యోగాల కోత పెట్టింది. ఈ కంపెనీ అమెరికా దేశానిది. ఈ కంపెనీ తీసుకున్న డిసిషన్ దెబ్బకు ఐటీ ప్రోసెషనల్స్ అబ్బా అంటున్నారు.

వచ్చే కొన్ని నెలల్లో 12 వేల మంది సిబ్బందిని తొలగించడానికి సిద్ధమవుతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించు కోవడంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని ఉన్నతాధికారి ఒకరు సంకేతాలిచ్చారు. కాగా, సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి గాను సంస్థ 497 మిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని గడించింది. అంత క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 477 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే 4.1 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.

 ప్రస్తుత సంవత్సరానికి గాను ఆదాయంలో వృద్ధి 4.6 , 4.9 శాతం మధ్యలో ఉంటుందని అవుట్‌ లుక్‌లో పేర్కొంది. ఆదాయం 4.2 శాతం పెరిగి 4.25 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. గడిచిన కొన్ని నెలలుగా సంస్థ అన్ని విభాగాల్లో రాణిస్తున్నదని, ఐటీ రంగంలో పోటీ తీవ్రతర మవుతున్నప్పటికీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా నమోదయ్యాయని కాగ్నిజెంట్‌ సీఈవో బ్రియన్‌ హుంఫైర్స్‌ తెలిపారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 10 వేల నుంచి 12 వేల వరకు మధ్య స్థాయి నుంచి సీనియర్‌ లెవల్‌ స్థాయి ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ప్రకటించారు.

స్థూలంగా 12 వేల మంది వరకు ఉండ నుండగా, నికరంగా మాత్రం 5 వేల నుంచి 7 వేల వరకు అని చెప్పారు. మొత్తం సిబ్బందిలో ఈ వాటా 2 శాతం. భారత్‌లో ఉద్యోగుల తొలగింపు గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంచనా. సెప్టెంబర్‌ 2019 నాటికి సంస్థలో 2,89,900 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, అదే భారత్‌లో ఇటీవల 2 లక్షలు దాటారు. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా గత త్రైమాసికంలో సంస్థ 150 , 200 మిలియన్‌ డాలర్లను నియంత్రించు కోగలిగింది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!