షారూక్ ఆహ్వానం..అట్లికి అదృష్టం


 చిన్న వయసులోనే టాప్ రేంజ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న తమిళ డైరెక్టర్ అట్లికి అదృష్టం తలుపు తట్టింది. ఇప్పటికే తాను విజయ్ తో తీసిన బిగిల్ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తూ రికార్డు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రపంచ మంతటా 4000 వేల థియేటర్లలో విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. అన్ని చోట్లా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అట్లికే దక్కుతుంది. అట్లి ఇప్పటి దాకా కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. కానీ ప్రతి చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కోట్లు కురిపించాయి.

మొదట్లో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నా, అంతిమంగా బిగిల్ అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. అటు తమిళ్ లో విడుదలైన రెండు సినిమాలు బిగిల్, ఖైదీ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అట్లి లోని టాలెంట్ ఇప్పుడు దేశానికి తెలిసింది. చూస్తే చిన్నోడు..మహా గట్టోడు అని బాలీవుడ్ బాద్ షా నమ్మాడు. ఏకంగా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ ఏడాది అట్లికి ఇదో పెద్ద గిఫ్ట్ అను కోవాలి. చాలా మంది షారుఖ్ ఖాన్ తో సినిమాలు చేయాలని తహ తహ లాడతారు. కానీ ఆ ఒక్క అరుదైన ఛాన్స్ మాత్రం అట్లీని వరించింది. కాగా బాలీవుడ్ బాద్‌షా నటించిన జీరో ఆశించిన విజయాన్ని అందించ లేదు.

తాజాగా షారుక్ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి బయట కొచ్చింది. ఆ కొత్త సినిమా పేరు ‘సంకి’. ఆట్లీ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. షారుక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశాడు. ఆట్లీ దర్శకత్వం వహించిన మెర్సల్ రీమేక్ లో షారుక్ నటిస్తాడని తొలుత వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ పట్టా లెక్కనుంది. దీంతో అటు అట్లి అభిమానులు..ఇటు బాద్ షా ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!