ప్రమాదంలో సమాచారం

టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రపంచం చిన్నదై పోయింది. కానీ అదే టెక్నాలజీ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. అంత కంటే ఎక్కువగా బురిడీ కొట్టిస్తోంది. ప్రతి ఒక్కరు దానిని వాడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో మంచి మాటేమిటో కానీ కీడే ఎక్కువగా జరుగుతోంది. కోట్లాది మంది ప్రతి నిత్యం స్మార్ట్ ఫోన్స్ తోనే గడిపేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా. అంతా అందులోనే లీనమై పోతున్నారు. ఇదే సమయంలో హ్యాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువై పోతున్నారు. ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు తమ ప్రయత్నాలు మాను కోవడం లేదు. ఆయా కంపెనీలు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఏదో ఒక రూపంలో వైరస్ లను ఇంట్రడ్యూజ్ చేస్తూ జనానికి, కంట్రీస్ కు ఝలక్ ఇస్తున్నారు.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి గూఢచర్యం నెరిపిన వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా ఆయా వ్యక్తుల వాట్సాప్‌ ఖాతాల్లో ఎలాంటి సమాచారం మార్పిడి అవుతుందో నిఘా పెట్టారని ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ సంస్థ తాజాగా సంచలన విషయాలు బయట పెట్టింది.పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఖాతాలను హ్యాక్‌ చేశారని, ఇందుకు గాను ఇజ్రాయెల్‌ కంపెనీ ప్రభుత్వ గూఢచారులకు వెన్ను దన్నుగా నిలిచిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌కు సమాధానమిస్తూ వాట్సాప్‌ ఈ విస్మయ పరిచే విషయాలను వెల్లడించింది.

ఇలా వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌ గురైన వ్యక్తులలో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. కాగా ఎంత మంది ఖాతాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయాలను మాత్రం వాట్సాప్‌ వెల్లడించ లేదు. జర్నలిస్టులు, విద్యావేత్తలు, దళిత, మానవ హక్కుల కార్యకర్తలు ఇలా కనీసం ౨౪ మందికి పైగా వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో రెండు వారాల పాటు వారి వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని, ఈ విషయాన్ని స్పెషల్‌ మెసెజ్‌ ద్వారా హాకింగ్‌ బారిన పడిన వ్యక్తులకు తెలియ జేశామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 2019 మే నెలలో అత్యంత పటిష్టమైన సైబర్‌ అటాక్‌ను మేం అడ్డుకున్నాం. మా వీడియో కాలింగ్‌ సిస్టంలోకి చొరబడి..పలువురు వాట్సాప్‌ యూజర్ల మొబైల్‌ డివైజ్‌ల్లోకి మాల్‌ వేర్‌ను పంపేందుకు ఈ అటాక్‌ ప్రయత్నించింది.

ఈ దాడి జరిగిన యూజర్‌ వీడియో కాల్‌ను ఎత్తక పోయినా, ఇది మొబైల్‌లోకి చొర బడుతుంది. మేం వెంటనే కొత్త ప్రొటెక్షన్స్‌ యాడ్‌ చేసి వాట్సాప్‌ నూతన అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల ఖాతాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. నేరుగా ఈ సైబర్‌ అటాక్‌ బారిన పడినట్టు భావిస్తున్న దాదాపు 1400  మంది యూజర్లకు ప్రత్యేక వాట్సాప్‌ మెసెజ్‌ ద్వారా సమాచారమిచ్చాం అని ఫేస్‌బుక్‌ తెలిపింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రైవసీ హక్కుల పట్ల బీజేపీ సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, ఈ గూఢచర్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!