కుదరని సయోధ్య..బీజేపీదే మరాఠా
శివ సేన, బీజేపీల మధ్య ఇంకా సయోధ్య కుదరక ముందే బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకో వైపు బీజేపీ కాకుండా కాంగ్రెసుతో నైనా కలిసి కుర్చీ చేజిక్కించు కునేందుకు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే పావులు కదుపుతున్నారు. ఈ మేరకు అనూహ్యంగా పాలిటిక్స్ మారి పోతున్నాయి. ఇదే సమయంలో శరద్ పవార్ చీఫ్ గా ఉన్న ఎన్సీపీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటింది. అయితే ప్రతిపక్షంలోనే ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లో తాము శివసేనతో చేతులు కలిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు పవార్.
అధికార పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య ప్రతిష్టంభన ఓవైపు కొన సాగుతుండగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో బీజేపీ సొంతగానే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. కూటమి నుంచి శివసేన తప్పుకున్నా తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు ప్రసాద్ లద్, చంద్రకాంత్ పాటిల్‌లకు అప్పగించారు. మరోవైపు తాము ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాకు కట్టుబడి ఉన్నామని, సీఎం పదవిని చెరి రెండు న్నరేళ్లు పంచు కోవాలనే డిమాండ్‌ను శివసేన నేత సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. శివసేన కోరుకుంటే రాష్ట్రంలో సుస్ధిర ప్రభుత్వం అందించేందుకు అవసరమైన సంఖ్యా బలం తాము సాధిస్తామని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. అమిత్ షా..ఉద్దవ్ లమధ్య వార్ ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి