కరోనా కల్లోలం..దేశం అల్లకల్లోలం

కరోనా దెబ్బకు ఇండియా అల్లాడుతోంది. ఇప్పటికే కేసులు వందలు దాటి వేయి వరకు వస్తున్నాయి. దీంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్న భారత ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఏప్రిల్ 14 వరకు షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు. అన్ని రాష్ట్రాలు పూర్తిగా క్లోజ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా చాలా వరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగితే అమెరికా మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. మొదట్లో దీనిని లైట్‌గా తీసుకున్న ప్రెసిడెంట్ ట్రంప్ ..దీని దెబ్బకు రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో గత్యంతరం లేక ఎవ్వరూ బయటకు రావద్దంటూ ప్రకటన చేశారు. అంతే కాకుండా ఈ వైరస్ ను వ్యాప్తి చెందేలా చేసిన చైనాను ఆయన టార్గెట్ చేశారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనే ఉద్ధేశంతోనే చైనా ఇలా చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డ్రాగన్ చైనా అమెరికాపై మండి పడింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోకుంటే బాగ...