క‌రోనా క‌ల్లోలం..దేశం అల్ల‌క‌ల్లోలం

క‌రోనా దెబ్బ‌కు ఇండియా అల్లాడుతోంది. ఇప్ప‌టికే కేసులు వంద‌లు దాటి వేయి వ‌ర‌కు వ‌స్తున్నాయి. దీంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్న భార‌త ప్ర‌భుత్వం గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీజీ ఏప్రిల్ 14 వ‌ర‌కు ష‌ట్ డౌన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో కోట్లాది మంది ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అన్ని రాష్ట్రాలు పూర్తిగా క్లోజ్ చేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చైనా చాలా వ‌ర‌కు కరోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా కంట్రోల్ చేయ‌గ‌లిగితే అమెరికా మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. మొద‌ట్లో దీనిని లైట్‌గా తీసుకున్న ప్రెసిడెంట్ ట్రంప్ ..దీని దెబ్బ‌కు రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండ‌డంతో గ‌త్యంత‌రం లేక ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ ప్ర‌క‌ట‌న చేశారు. అంతే కాకుండా ఈ వైర‌స్ ను వ్యాప్తి చెందేలా చేసిన చైనాను ఆయ‌న టార్గెట్ చేశారు.
త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ కొట్టాల‌నే ఉద్ధేశంతోనే చైనా ఇలా చేసిందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డ్రాగ‌న్ చైనా అమెరికాపై మండి ప‌డింది. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోకుంటే బాగుండ‌దంటూ ఆ దేశ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకో వైపు క‌రోనా వైర‌స్ రాకెట్ కంటే వేగంగా అన్ని దేశాల‌కు ఇప్ప‌టికే అల్ల‌క‌ల్లోలం చేసింది. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. ఇప్ప‌టికే 195 దేశాల‌కు వ్యాప్తి చెందిన ఈ డిసీజ్ ఇపుడు ప్ర‌తి ఒక్క కంట్రీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైర‌స్ లేకుండా చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు వైద్యులు, సైంటిస్టులు. ఇప్ప‌టి దాకా ప్ర‌పంచ వ్యాప్తంగా 21 వేల మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. ల‌క్ష‌లాది మంది అనుమానితులుగా ఉన్నారు. కంటికి క‌నిపించ‌కుండా ఉండే ఈ వైర‌స్ ఎవ‌రిని ఎప్పుడు కాటేస్తుందో అంతు ప‌ట్ట‌డం లేదు.
పీఎం మోదీ, సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్‌లు ఇప్ప‌టికే చేతులు జోడించి వేడుకున్నారు క‌రోనా బారి నుంచి కాపాడు కోవాలంటే ఎవ‌రి ఇళ్ల‌ల్లో వారు ఉండ‌టం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘించి ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే కాల్చి వేసేందుకు సైతం వెనుకాడ‌బోమంటూ తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. అయినా జ‌నం మాత్రం ఎప్ప‌టి లాగే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. కొన్ని చోట్ల పోలీసుల‌తో వాగ్వావాదానికి దిగారు. పోలీసులు కంట్రోల్ చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఇక పేష‌న్స్ కోల్పోయి కొంత‌మందిపై లాఠీలు ఝులిపించారు. సీఎం కేసీఆర్ మాత్రం కొన్ని స‌ర్వీసుల‌ను మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాటిలో మీడియా, హెల్త్, ట్రాన్స్ పోర్టు రంగాల‌కు వెస‌లుబాటు క‌ల్పించినా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. మొత్తం మీద అనూహ్యంగా ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ ఇంకెంత మందిని పొట్ట‌న పెట్టుకుంటుందో..ఇంకెప్పుడు ఈ మ‌హ‌మ్మారి వైదొలుగుతుందో వేచి చూడాల్సిందే. 

కామెంట్‌లు