సౌదీ మహిళలకు సర్కార్ బంపర్ ఆఫర్

అరబ్ దేశాలు అంటేనే జనం జడుసు కుంటారు. కారణం ఏమిటంటే ఆయా దేశాలలో ఎక్కడా లేని రీతిలో చట్టాలు, కఠినతరమైన నియమ నిబంధనలు ఉంటాయి. అది జగమెరిగిన సత్యం. ఏదైనా లేదా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చావు పలకరిస్తుంది. జనం ముందే శిక్షలు అమలు చేస్తుంది అక్కడి ఆర్మీ. ప్రపంచంలోని ప్రతి కంట్రీ కూడా ఇదే పద్దతిని అనుసరిస్తూ వస్తోంది అనాదిగా. అయితే సౌదీ అరేబియా మిగతా ముస్లిం దేశాలకు భిన్నంగా, విస్తు పోయేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అక్కడి యువరాజు ప్రజలకు మేలు చేకూర్చే పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో మహిళలు బయటకు రావాలంటే నానా ఇబ్బందులు పడేవారు. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటం, పరదాలు లేకుండా ప్రయాణం చేయడం, షాపింగ్ లాంటివి చేయకూడదు. క్రీడల్లో వీరు పాల్గొనేందుకు ప్రవేశం ఉండేది కాదు. కానీ సౌదీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మహిళలు పరదాలు ధరించకుండానే ఎక్కడికైనా వెళ్లవచ్చంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని, విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటే తమ ప్రభుత్వం అందుకు తగ్గట్టు సహాయం కూడా చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు అక్కడి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. యువరాజు పై తమ కృతజ్ఞత...