సర్కార్ తీరుపై హైకోర్టు సీరియస్
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని సార్లు కోర్టు మెట్టి కాయలు వేసినా చలనం కనిపించడం లేదు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. సంస్థలో పనిచేస్తున్న వారంతా మాజీ ఉద్యోగులేనని, ఇక వారు సంస్థ ఉద్యోగులు కారని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంబంధిత మంత్రి అజయ్ కుమార్ తో పాటు రవాణా, ఆర్టీసీ, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదే అదనుగా జనం నుంచి ప్రైవేట్ వాహనదారులు అందినంత దోచుకుంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం దాని వైపు కన్నెత్తి చూడటం లేదు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, పిలిస్తే వస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేసినా స్పందించలేదు.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మొత్తం కార్మికులు, సిబ్బంది రోడ్డెక్కారు. తమ ఆందోళనను ఉదృతం చేశారు. అకారణ సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే సమ్మెను విరమించేలా చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన స్టూడెంట్ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు సమగ్ర వివరాలతో రావాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ సంస్థను ఆదేశించింది. దీంతో పాటు ఆర్టీసీ జేఏసీ నాయకుల తరపున పిటిషన్ దాఖలైంది. వీరి తరపున మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి, రచన రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తరపున లాయర్ తమ వాదనలు జడ్జి ముందు వినిపించారు. సర్కార్ తరపున పూర్తి వివరాలు లేకుండానే కోర్టుకు రావడంపై కోర్టు సీరియస్ అయ్యింది. బస్సులన్నీ డిపోల్లోనే కనిపిస్తున్నాయి, మరి ప్రజలను మీరు గమ్య స్థానాలకు చేరుస్తున్నామని చెబుతున్నారు..? దీనిని ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వ నివేదిక అసంపూర్తిగా ఉందన్నారు. సమగ్ర నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రోడ్లపైకి బస్సులు రావడం లేదని, బస్సు పాసులు చెల్లడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించింది. బస్సుల్లో అధిక చార్జీల వసూళ్లను నియంత్రించాలని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్యపై లాయర్ రాపోలు భాస్కర్, వాచ్ పీపుల్ సంస్థ సైతం వ్యాజ్యాలు వేశాయి. అయితే ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదంటూ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్ రావు తెలియజేశారు. దీనిపై ధర్మాసనం ఫైర్ అయ్యింది. ఇంటి నుంచి హైకోర్టు వరకు వస్తుంటే రోడ్డుపై ఒక్క బస్సు కనిపించలేదని మీరు చెప్పింది అబద్దమని పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణ సర్కార్ ఆర్టీసీ సహకార సంస్థ నుంచి 545 కోట్లతో పాటు పీఎఫ్ డబ్బులు కూడా వాడుకుందని మరో లాయర్ రచనా రెడ్డి తెలిపారు. మొత్తం మీద కోర్టు సమ్మె పై అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి