అదును చూసి దెబ్బకొట్టిన ఆర్ఐఎల్
భారతీయ టెలికాం రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సబ్ స్క్రైబర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముంబైలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రిలియన్స్ జియో ఊహించని రీతిలో ప్రత్యర్థి కంపెనీలను దెబ్బ కొట్టింది. తక్కువ ఖర్చుకే ఎక్కువ డేటా వినియోగం తో పాటు అపరిమితంగా ఏ టెలికాం ఆపరేట్ కైనా ..లేదా ఏ నెట్ వర్క్ కైనా ..ఎక్కడినుంచి..ఎక్కడికైనా మాట్లాడు కోవచ్చు అంటూ ఆఫర్స్ ప్రకటించింది. దీంతో బంపర్ ఆఫర్స్ కు ఆకర్షితులైన లక్షలాది మంది ఇతర నెట్ వర్క్ ల నుండి జియో నెట్ వర్క్ కు మారి పోయారు. ఒక్క ఏడాదిలోనే 34 కోట్లకు చేరుకుంది వీరి సంఖ్య. ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ , టాటా టెలికాం, భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ నుంచి అధిక శాతం టెలికాం వినియోగదారులు రిలయన్స్ జియో కు మారారు. దీంతో ఆర్ఐఎల్ జియో షేర్ ఒక్కసారిగా పెరిగి పోయింది.
ఓ వైపు భారతీయ మార్కెట్ పూర్తిగా కుదుపునకు లోనవుతున్న తరుణంలో ఆర్ఐఎల్ షేర్స్ మాత్రం దూసుకు వెళ్లాయి. ఇదే సమయంలో అంతా ఫ్రీ అనే సరికల్లా జనం విరగబడి జియో ను ఎంచుకున్నారు. ముంబయిలో ఆర్ఐఎల్ కంపెనీ భారీ ఎత్తున లాంచ్ చేసింది. ఈ సందర్బంగా ఎంతో ఆర్భాటంగా ఆఫర్స్ ప్రకటించింది. గతంలో ఇతర నెట్ వర్క్ లకు జియో నుంచి చేసుకునే వీలుండేది. అయితే తాజాగా జియో సబ్ స్క్రైబర్స్ మీద దెబ్బ కొట్టింది. భారతీయులు గర్వపడేలా ఆర్ఐఎల్ సౌకర్యాలు కల్పిస్తుందని ఆర్ఐఎల్ చైర్మన్ చిలుక పలుకులు పలికారు. భారీ ఆదాయం జియో వల్ల ఆర్ఐఎల్ కంపెనీకి చేకూరింది. కాగా మాట్లాడుకునే ఫ్రీడం ఇస్తున్నామని గర్వంగా ప్రకటించిన జియో.. ఇప్పుడు ఆ భారం మోయలేమని చేతులెత్తేసింది. ఇప్పటికే 3 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామని ఇక ఇవ్వలేమని స్పష్టం చేసింది .
ట్రాయ్ నిబంధన ఐయూసీ పేరు చెప్పి కస్టమర్లపై బాదుడు మోపింది. ఇప్పటి వరకు ఉన్న ఫ్రీ కాలింగ్ కు ముగింపు పలికింది. జియో నుంచి ఎయిర్ టెల్, ఐడియా లాంటి ఇతర నెట్ వర్క్ కస్టమర్లకు ఫోన్ చేయాలంటే అదనపు రీచార్జ్ చేసుకోక తప్పదు. ఔట్ గోయింగ్ కాల్స్ పై ఇక నిమిషానికి ఆరు పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం రెగ్యులర్ గా చేసుకునే రీచార్జ్ తో పాటు ప్రత్యేకంగా ఐయూసీ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి. దాని ద్వారా వచ్చే మెయిన్ బ్యాలెన్స్ నుంచి ఈ ఆరు పైసల చార్జ్ ని వసూలు చేస్తుంది జియో. ఇందు కోసం నాలుగు ఐయూసీ ప్లాన్స్ ను జియో ప్రకటించింది.10 రూపాయలతో ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే ఇతర నెట్ వర్క్ కస్టమర్లకు 124 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
దీంతో పాటే 1 జీబీ డేటా ఉచితంగా ఇస్తోంది జియో. అదేవిధంగా 20 రూపాయలతో ప్లాన్ తీసుకుంటే 249 నిమిషాల వరకు కాల్స్, 2 జీబీ డేటా వస్తుంది. 50 రూపాయల ప్లాన్ వేసుకుంటే 656 నిమిషాలు, 5 జీబీ డేటా వాడుకోవచ్చు.100 రూపాయల ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్నట్లయితే 1362 నిమిషాల కాల్స్ తో పాటు 10 జీబీ డేటాను వాడుకునే వీలుంటుంది. ఇప్పటికే రీఛార్జ్ చేసుకున్న వారు తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకుంటేనే ఇతర నెట్ వర్క్ లకు మాట్లాడగలం. లేదంటే ఓన్లీ జియో ఉన్న నెట్ వర్క్ లకు మాత్రమే మాట్లాడగలం. మొత్తం మీద ఉచితం అంటూనే జనానికి ఇంటర్ నెట్ అలవాటు చేసిన ఆర్ఐఎల్ ఇప్పుడు అది లేకుండా ఉండలేని స్టేజ్ కి తీసుకు వచ్చింది. జనాన్ని బురిడీ కొట్టించడంలో అంబానీల తర్వాతే ఎవరైనా.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి