మయాంకా..మజాకా..!
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియాదే పై చేయి సాధించింది. మొదటి టెస్ట్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న భారత జట్టు రెండో టెస్టు లోను తన సత్తా చాటింది. మొదటి టెస్ట్ లో శతకాలతో దుమ్ము రేపిన రోహిత్ శర్మ ఆరంభం లోనే వెనుదిరిగినా, విశాఖ లో డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ మరోసారి తన ఫామ్ ను కొనసాగించాడు. రెండో టెస్టులో మరో సెంచరీ సాధించాడు. మయాంక్ తో చటేశ్వర్ పుజారా తోడవ్వడంతో టీమిండియా పటిష్టమైన స్థితికి చేరుకుంది. వీరిద్దరూ పెవిలియన్ దారి పట్టాక బరిలోకి దిగిన జట్టు సారథి విరాట్ కోహ్లీ, ఉప సారథి అజింక్యా రహానే సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. కాగా వెలుతురు సరిగా లేక పోవడంతో తొలి రోజు ఆటను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపి వేశారు.
పుజారా, కోహ్లీ లు ఆఫ్ సెంచరీలు చేశారు. మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేశారు. ఈ మొత్తం ఆటలో ప్రధానంగా మయాంక్ అగర్వాల్ మెరిశాడు. తన ఆట తీరుతో అభిమానులను అలరించాడు. తనకు అచ్చోచ్చిన పూణే పిచ్ పై రెచ్చి పోయాడు. మైదానం నలువైపులా షాట్స్ కొట్టాడు. 195 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 108 పరుగు చేసి వెనుదిరిగాడు. మరో వైపు కోహ్లీ 105 బంతుల్లో 10 ఫోర్లతో 63 నాటౌట్ గా ఉండగా పుజారా 58 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రెహానే కూడా కోహ్లీకి తోడుగా ఉండడంతో రెండో రోజు ఇండియా మరిన్ని పరుగులు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
సౌత్ ఆఫ్రికా జట్టు తరపున రబాడ 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసి వరుసగా తొమ్మిదో సారి టాస్ కోల్పోయాడు. అంతకు ముందు మ్యాచ్ స్టార్ట్ అయ్యాక బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై తొలి గంట సౌతాఫ్రికాదే అయింది. రబాడ, ఫిలాండర్ అద్భుతమైన బంతులతో రోహిత్, మయాంక్‌ను పదే పదే బీట్ చేశారు. తర్వాత మయాంక్ దూకుడు పెంచాడు. రోహిత్ అవుటైనా తొట్రు పాటుకు లోనవకుండా పరుగులు చేశాడు. మొత్తం మీద టీమిండియా తన సత్తా చాటనుంది. ఇప్పటికీ కోహ్లీ, రహానే బరిలో ఉండడం అంటే మరిన్ని పరుగులు రానున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి