మెగాస్టార్ పై తమిళసై ప్రశంసల జల్లు
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహ్మ రెడ్డి సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుని కలెక్షన్స్ లో సునామి సృష్టిస్తోంది. అయిదు భాషల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. రాయలసీమకు చెందిన మొదటి సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమాను తీశారు. దాదాపు కొన్నేళ్లుగా ఈ కథ నడుస్తూ ఉన్నది. చరిత్ర పుటల్లో ఉన్నప్పటికినీ రావాల్సినంత ప్రచారం రాలేదు ఆ మహా యోధుడికి. ఒక పాలేరుగా ఉంటూ బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన వీరుడిగా ఇప్పటికీ రాయలసీమలో కథలు కథలుగా చెప్పుకుంటారు అక్కడి జనం. ఆనోటా ఈనోటా విని తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్ మెగాస్టార్ చెవిలో పడేశారు. ఎన్నేళ్లయినా సరే ఆ ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి కథను నువ్వు మాత్రమే చేయగలవని చెప్పారు. దీనిని చిరంజీవి సీరియస్ గా తీసుకున్నారు.
కానీ సినిమా తీయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. వందల కోట్ల బడ్జెట్. వేరే వాళ్ళు రాని పరిస్థితి. ఇంతగా ఖర్చు చేసి తీస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న అనుమానం ఇంకో వైపు. అన్నిటికంటే ఆ పోరాటపు యోధుడి గురించి ఎవరు తీయగలరు అని పలుమార్లు చిరంజీవి ఆలోచించారు. సడన్ గా ఆయన తన ఆలోచనలను కొడుకు రామ్ చరణ్ కు చెప్పారు. వేరే వాళ్ళు ఎందుకు మనమే పెట్టుబడి పెడదాం. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదని తండ్రికి భరోసా ఇచ్చాడు. ఇక డైరెక్టర్ ఎవరుండాలనే దానిపై చర్చోప చర్చలు జరిగాయి. ధ్రువ సినిమా తీస్తున్న సమయంలో సురేందర్ రెడ్డితో కొంచం చనువు ఏర్పడింది చరణ్ కు. తాను అయితేనే దీనికి కరెక్ట్ గా సరి పోతాడని చెప్పడంతో చిరు ఓకే చేశారు. సురేందర్ రెడ్డి మొదట భయపడినా చివరకు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సైరా సినిమాను తెరమీదకు తీసుకు వచ్చాడు.
పోరాట సన్నివేశాలు, డైలాగ్స్ , పాటలు పేలాయి. చిరంజీవి నరసింహ్మ రెడ్డిగా, అమితాబ్ బచ్చన్ గురువుగా, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు ఇలా ప్రతి ఒక్కరు పోటీపడి నటించారు. సినిమాలో జీవించారు. విడుదలైన ప్రతి చోటా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దీంతో చిరంజీవి తన సంతోషాన్ని ఆపుకోలేక పోయారు. ఆయన స్వయంగా తెలంగాణ గవర్నర్ తమిళసై దగ్గరకు వెళ్లారు. సైరా సినిమాను చూడమని కోరారు. దీంతో గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సైరా సినిమాను చూశారు. చిరంజీవి నటనను చూసి విస్తు పోయారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా నటించారని ఆమె మెచ్చుకున్నారు. తాను 20 ఏళ్లలో రెండు చిత్రాలే చూశానని గవర్నర్ చెప్పారు. 2018లో రంజిత్ పా దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్ నటించిన కాలాను చూశానని ఇప్పుడు సైరాను చూశానని అన్నారు. మరో వైపు కళాబంధు సుబ్బిరామి రెడ్డి కూడా చిరును అభినందించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి