కత్తుల కరచాలనం కానుందా శాంతివనం
దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. అంతర్జాతీయ వేదికపై యుఎన్ సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై నిప్పులు చెరిగారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిరాధారమైన విమర్శలు గుప్పించారు. అయినా ఇండియా ఎక్కడా చెక్కు చెదరలేదు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులను పెంచి పోషిస్తున్న తీరును ఎండగట్టింది. అంతే కాకుండా ఆధారాలతో నిరూపించింది. దెబ్బకు అప్పటి దాకా బీరాలు పలికిన ఇమ్రాన్ ఖాన్ కు సభ్యదేశాలు సైతం మద్దతివ్వలేదు. దీంతో పాక్ కు ఒక్క చైనా తప్పా ఏ అరబ్ కంట్రీ కూడా డోంట్ కేర్ అన్నాయి. నిన్నటి దాకా వంత పాడిన అమెరికా సైతం ఇండియాకు సపోర్ట్ గా నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండియాతో సమావేశమై సమస్యను పరిష్కరించు కోవాలని సూచించింది. ఆ మేరకు మోడీకి పూర్తి మద్దతు ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.
దీంతో పాటు మరో అగ్ర రాజ్యం రష్యా సైతం ఇండియాకు మద్దతు తెలిపింది. జమ్మూ, కాశ్మీర్ అన్నది భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేశారు ప్రెసిడెంట్ పుతిన్. దీంతో ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఒంటరిగా మిగిలి పోయింది. ఇదే సమయంలో నిన్నటి దాకా పాక్ కు వంత పాడిన చైనా ఉన్నట్టుండి తన మాట తీరును మార్చుకుంది. ఎవరూ ఊహించని రీతిలో చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ భారత్ పర్య టన ఖరారైది. ఈ విషయాన్ని రెండు దేశాలూ కేవలం 50 గంటల ముందు ప్రకటించాయి. చెన్నై సమీపంలోని జిన్ పింగ్ మహాబలిపురానికి వెళ్తారు. అక్కడే ఉండి ఏడో-ఎనిమిదో శతాబ్దికి చెందిన ప్రాచీన ఆలయాలు, బౌద్ధాకృతులను సందర్శిస్తారు. ప్రధాని మోదీతో కీలకాంశాలపై అనధికారిక చర్చలు జరుపుతారు. అధికారికం కాక పోయినా రెండు దేశాల మధ్య ఉన్న మౌలిక అంశాలను మోదీ ప్రస్తావిస్తారని దౌత్య వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ వ్యవహారాన్ని భారత్-పాక్‌లు రెండూ ద్వైపాక్షికంగానే తేల్చుకోవాలని స్పష్టం చేసింది చైనా.
ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌పై పాక్‌కు అండగా నిలిచిన చైనా తన స్వరాన్ని మార్చడం భారత్‌కు కొంత దౌత్య విజయమేనని చెబుతున్నారు. కాగా చైనా అధ్యక్షుడి పర్యటన కోసం 747 బోయింగ్ కార్గో విమానంలో 4 బుల్లెట్ ప్రూఫ్ కార్లు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాయి. నలుపు రంగు కలిగిన 4 కార్లు ఇంజన్ స్టార్ట్ అయిన 8 సెకన్ల లోపే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. బాంబు దాడుల ను కూడా తట్టుకుంటాయి. ఒక్కో కారు 6.5 అడుగుల వెడుల్పు, ఐదు అడుగుల ఎత్తు, 3152 కేజీల బరువు కలిగి ఉంటుంది. జిన్‌పింగ్ చెన్నై విమానాశ్రయానికి చేరుకోగానే ఈ 4 కార్లలో ఒకదాంట్లో ఎక్కి స్థానిక గిండీలోని స్టార్ హోటల్‌కు వెళ్తారు. మహాబలి పురానికి కూడా ఈ కారులోనే చేరుకుంటారు. మొత్తం మీద చైనా ప్రెసిడెంట్ తో మోడీ సమావేశం కావడం నూతన చరిత్రకు నాంది అనుకోవాల్సి ఉంటుంది. దౌత్య పరంగా ఇప్పుడు ఇరు దేశాలకు వ్యాపార, వాణిజ్య అవసరాలు ఉన్నాయి. నిత్యం కత్తులతో కరచాలనం చేసే ఈ దిగ్గజ నేతల మధ్య శాంతివనం వెళ్లి విరియనుందా అన్నది త్వరలో తేలనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి