బిగ్ పై కన్నేసిన అమెజాన్ ..?

ప్రపంచం లోని లాజిస్టిక్ రంగంలో టాప్ పోజిషిన్ లో ఉన్న అమెజాన్ కంపెనీ ప్రత్యర్థి కంపెనీల నుండి పోటీని తట్టుకునేందుకు పావులు కదుపుతోంది. వ్యాపార రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న సదరు కంపెనీ ఇండియాలో మొదటి శ్రేణి లో కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇప్పుడు ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే లభిస్తోంది. రిటైలింగ్ సెగ్మెంట్ పరంగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది . తాజాగా ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనడానికి ఈ ఈకామర్స్ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది మొదట్లో ఉన్నప్పటికి త్వరలో డీల్ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇండియా రిటైల్ మార్కెట్‌లో స్థానం సంపాదించు కోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చర్చలు ఫలవంతం అయ్యే దిశలో ఉన్నప్పటికీ ..ధర , వాల్యూ విషయం లోనే ఇంకా సందిగ్థత నెలకొంది . మార్కెట్ లో ఇప్పటికే బిగబజార్ కు భారీ ఎత్తున వినియోగదారులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఊరికి అమెజాన్ తన వస్తువులను డెలివర్ చేస్తోంది. ఒక రోజు లేదా రెండు రోజుల్లో చేరవేస్తుంది. ఇందు కోసం లేటెస్ట్ టెక్నాలజీ ని అమెజా...