ప్రకృతి ప్రకోపం..కడలి కల్లోలం..బతుకంత కష్టం

నిన్నటి దాకా వర్షాల కోసం ఎదురు చూసిన జనం ఇప్పుడు వరుణదేవుడు దెబ్బకు తల్లడిల్లి పోతున్నారు. ఎటు చూసినా నీళ్ళే..ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రెండు తెలుగు రాష్ట్రాలు నిండు కుదనల్ని తలపింప చేస్తున్నాయి. భారీ ఎత్తున ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణమ్మ ఇటు తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. బీచుపల్లి వద్ద శివాలయం వరకు నీళ్లు రాగా, పసుపుల వద్ద ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ , జూరాల , శ్రీశైలం కు వరద నీరు పోటెత్తింది. దీంతో ఆయా ప్రాజెక్టుల నీటి పారుదల అధికారులు గేట్లను ఎత్తి వేశారు. గత కొంత కాలంగా ఆశించినంత మేర వానలు పలకరించలేదు. ఎన్నడూ లేనంతగా ఎండలు దెబ్బకొట్టాయి. వర్షపు జాడలు లేక జనం అల్లాడి పోయారు . సాగు మాట దేవుడెరుగు , కనీసం తాగేందుకు నీళ్ళయినా ఈసారి వస్తాయో లేదోనని ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

కృష్ణ జిల్లాలోని దిగువ ప్రాంతాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే  26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో తో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది .దీంతో దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు నీటిని వదిలారు. టెయిల్ పాండ్ మీదుగా పులిచింతలకు నీటిని వదిలారు . ప్రకాశం బ్యారేజీ నిండడంతో గేట్లు ఎత్తి వేశారు. ఓ వైపు అనావృష్టి ఇంకో  వైపు అతి వృష్టి అన్న చందంగా తయారైంది రాష్ట్రాల పరిస్థితి. వచ్చే నీటిని వడిసి పట్టుకునేలా ఈ రోజు వరకు ప్రాజెక్టులను డిజైన్ చేసిన దాఖలాలు లేవు. ఎవరి ప్రయోజనాల కోసం వారు చేసుకుంటూ పోయారు. ఆరు జిల్లాలకు దేశ స్థాయిలో గుర్తింపు పొందిన నల్లమల ఇప్పుడు విలవిలాడుతోంది. యురేనియం నిల్వలు ఉన్నాయంటూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది . విచిత్రం ఏమిటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే దేనిని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నాయి.

అడవినే నమ్ముకున్న బిడ్డలు మాత్రం భయాందోళనలకు లోనవుతున్నారు. ఎత్తి పరిస్థితుల్లోనూ తాము తమ భూములను ఇవ్వమని తెలిచి చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓ వైపు పచ్చదనం కాపాడు కోవాలని , పర్యావరణం బాగుండాలంటే హరితహారం చేపట్టాలని కోరుతున్న సర్కార్ యురేనియం విషయంలో నోరు మెదపడం లేదు. ఇప్పటికే విపక్షాలు దీనిపై గొంతెత్తాయి. అడవి బిడ్డల కోసం బాసటగా నిలబడ్డాయి .పొంగుతున్న ప్రాజెక్టులు , పారుతున్న నదులు , ప్రమాదకర స్థితిలో చేరుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. జనాన్ని ఓట్ల కోసం వేచి చూసేలా చేసిన పాలకులు ప్రకృతి ప్రకోపం నుండి ..కడలి కల్లోల నుండి రక్షించే చర్యలేవి చేపట్టలేక పోయారు వానల కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా మృతి చెందారు . మొత్తం మీద పలు ప్రాంతాలు , రాష్ట్రాలు విలవిలలాడి పోతున్నాయి.  

కామెంట్‌లు