బిగ్ పై కన్నేసిన అమెజాన్ ..?
ప్రపంచం లోని లాజిస్టిక్ రంగంలో టాప్ పోజిషిన్ లో ఉన్న అమెజాన్ కంపెనీ ప్రత్యర్థి కంపెనీల నుండి పోటీని తట్టుకునేందుకు పావులు కదుపుతోంది. వ్యాపార రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న సదరు కంపెనీ ఇండియాలో మొదటి శ్రేణి లో కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇప్పుడు ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే లభిస్తోంది. రిటైలింగ్ సెగ్మెంట్ పరంగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది . తాజాగా ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనడానికి ఈ ఈకామర్స్ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది మొదట్లో ఉన్నప్పటికి త్వరలో డీల్ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇండియా రిటైల్ మార్కెట్‌లో స్థానం సంపాదించు కోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చర్చలు ఫలవంతం అయ్యే దిశలో ఉన్నప్పటికీ ..ధర , వాల్యూ విషయం లోనే ఇంకా సందిగ్థత నెలకొంది . మార్కెట్ లో ఇప్పటికే బిగబజార్ కు భారీ ఎత్తున వినియోగదారులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఊరికి అమెజాన్ తన వస్తువులను డెలివర్ చేస్తోంది. ఒక రోజు లేదా రెండు రోజుల్లో చేరవేస్తుంది. ఇందు కోసం లేటెస్ట్ టెక్నాలజీ ని అమెజాన్ వాడుతోంది. అంతే కాకుండా భారీ వస్తువులను ఏర్పాటు చేసేందుకు రోబోలను ఉపయోగిస్తోంది ఈ కంపెనీ. సదరు కంపెనీ ..ఇప్పుడు బిగ్ బజార్ పై కన్నేసింది.
ముంబైకి చెందిన ఫ్యూచర్ రిటైల్ కంపెనీ బిగ్‌బజార్ పేరుతో సూపర్ బజార్ సహా పలు వ్యాపారాలు నడుపుతోంది. ఇందులో వాటా దక్కడం వల్ల అమెజాన్ రిటైలింగ్ రంగానికి కూడా విస్తరించే వీలు కలుగుతుంది. గతంలో అమెరికాలోని భారీ రిటైల్ చైన్ హోల్ ఫుడ్స్ మార్కెట్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది. దీని ద్వారా ఫుడ్ రిటైలింగ్ విభాగంపై పట్టు దక్కించుకుంది. కూరగాయలు, పాల వంటి వాటిని హోం డెలివరీ విధానంలోనే కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతుండడంతో అమెజాన్ ఫ్యూచర్ రిటైల్‌లో వాటాపై దృష్టి పెట్టింది. మరో యుఎస్ కంపెనీ వాల్‌మార్ట్ ఇది వరకే ఇక్కడ స్టోర్లు తెరిచింది. ముకేశ్ అంబానీ కూడా త్వరలో ఈ–కామర్స్‌లోకి రాబోతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి