గీడ మీ గూండాగిరీ చెల్లదు..కేసీఆర్ సీరియస్

మీరు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చెయ్యండి. కానీ మీ గూండాగిరీ, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెల్లవ్. ఉద్యమం చేసినా ప్రభుత్వం చలించదు. డిపోల వద్ద అరాచకం చేస్తే సహించం. ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించం. వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. చర్చలు ఉత్తి మాట. మూడు రోజుల్లో బస్సులన్నీ తిరుగుతాయి. తాము లేకుంటే ఆర్టీసీ నడవదని అనుకుంటున్నారు. ఎలా నడవదో నేను చూస్తా. ఉద్యమిస్తామని యూనియన్ నేతలు చెబుతున్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించం. గీడ మీ గూండాగిరీ నడవదు. ఇంత దాకా ఓపిక వహించాం. ఇక నుంచి ఉపేక్షించం. మరింత కఠినంగా ఉండబోతున్నాం. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా అరెస్టులు చేస్తాం. జైళ్లకు తరలిస్తాం. ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాం. మరిన్ని కొత్త బస్సులు నడుపుతాం. కొత్త వారిని తీసుకుంటాం. కాదని అడ్డంకులు సృష్టిస్తే తగిన గుణపాఠం నేర్పుతామని తీవ్ర హెచ్చరికలు చేశారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ సమ్...