బాలీవుడ్ ను షేక్ చేస్తున్న వార్

బాలీవుడ్ వర్గాలు విస్తుపోయేలా చేసింది వార్ సినిమా. ఇప్పటికే విడుదలైన అన్ని చోట్లా కోట్లు కొల్లగొడుతోంది. బాక్సాఫీస్‌ వద్ద వార్‌ తన హవాను కొనసాగిస్తోంది. ఈనెల గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన వార్‌ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది. విడుదలైన తొలి వారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 300 కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకు వెళుతోంది. ఈ మూవీ ప్రతిరోజు 9 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తూ పోతోంది. ఇప్పటికే 250 కోట్లు దాటేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో మంచి సినిమాలు లేక పోవడం కూడా వార్ సినిమాకు కలిసొచ్చింది. ఈ మూవీని తెలుగు, తమిళ్‌ భాషల్లో  విడుదల చేశారు. మొదటి రోజు నుంచే వసూళ్లు అదర గొట్టింది.

పెట్టిన పెట్టుబడి పూర్తి గా తిరిగి రావడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్‌ రోషన్‌, యువ సంచలనం టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో ఈ సినిమా తీశారు. ఈ యాక్షన్‌ మూవీ ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ పేరు మీదున్న రికార్డ్ ను బ్రేక్ చేసి రెండో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలబడింది. ఇక 2019లో బాలీవుడ్‌ లో కబీర్ సింగ్ సినిమా అత్యధికంగా 379 కోట్లు వసూలు చేసింది. అయితే వార్ సినిమా దీనిని అధిగమిస్తుందో లేదో చూడాలి. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా హృతిక్‌ రోషన్‌ 'వార్‌' సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను అందుకున్నాడు. లీడ్‌ క్యారక్టర్స్‌లో నటించిన హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ల నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా హృతిక్‌ తన లుక్స్‌, బాడీ ఫిజిక్‌, యాక్షన్‌ సీన్స్‌తో యూత్‌కు పిచ్చెక్కించాడు. ఇక టైగర్‌ ష్రాఫ్‌ చేసిన యాక‌్షన్‌ సీన్స్‌కు ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అలాగే వార్‌ సినిమా కోసం హృతిక్‌ రోషన్ తన బాడీనీ మేకోవర్‌ చేసిన విధానాన్ని 'కబీర్‌ ట్రాన్స్‌పార్మేషన్‌ ఫర్‌ వార్‌' పేరుతో వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన బాడీ ఫిజిక్‌ను మార్చు కోవడానికి హృతిక్‌ భారీ కసరత్తులే చేయాల్సి వచ్చింది. తాజాగా వార్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బాస్టర్‌ రన్‌ను కొనసాగిస్తుడంతో ఆ కష్టాన్ని మరిచి పోయేలా చేసింది. మొత్తంగా వార్ సినిమా బాలీవుడ్ లో ఓ సంచలనమనే చెప్పక తప్పదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!