ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ - సమ్మె అప్రజాస్వామికం

తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉగ్ర రూపం దాల్చుతోంది. బీజేపీ ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి కార్యక్రమం మూడు గంటలకు పైగా సాగింది. పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తో పాటు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, పిఓడబ్ల్యూ లీడర్ పద్మ, తదితరులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లక్ష్మణ్ సొమ్మసిల్లి పడి పోయారు. తర్వాత కొలు కోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీ కేంద్ర ప్రెసిడెంట్ నడ్డా ఫోన్ లో లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అధికార పార్టీ తప్పా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, మహిళా, విదార్థి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు తమ మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా రవాణా శాఖా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడారు. కార్మికులు చేస్తున్న సమ్మె అప్రజాస్వామికమని చెప్పారు.

ఏనాడు ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తానని చెప్పలేదన్నారు. చర్చలకు పిలిచినా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రాలేదని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ప్రస్తుతం నెలకొన్న ఆర్టీసీ సమ్మెపై సమీక్షించారు. ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికులను డిస్మిస్ చేయలేదని, వాళ్లంతకు వారే విధులకు దూరమయ్యారని చెప్పారు. అలాగే సెప్టెంబర్ నెల జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు సీఎం. కొత్తగా బస్సులు తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఎవరైతే సమ్మెలో పాల్గొనకుండా విధుల్లో ఉంటున్నారో వారే ఉద్యోగులుగా పరిగణింప బడతారని వెల్లడించారు.

కొందరు నాయకుల తీరు సమంజసంగా లేదని, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని త్వరలో చర్యలు తీసుకుంటామని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మరో వైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తమ కార్యాచరణను ప్రకటించింది. 19 న తెలంగాణ అంతటా బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. 14 న అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర బైఠాయింపు, ఆందోళనలు చేపట్టడం,15 న రాస్తోరోకోలు, మానవ హారాలు,16 న ఐకాసకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీలు,17 న ధూమ్ ధామ్ , 18 న బైక్ ర్యాలీలు ఉంటాయని వెల్లడించారు అశ్వత్థామ రెడ్డి. మొత్తం మీద ఆర్టీసీ జేఏసీ .. ప్రభుత్వం మధ్యన ఆధిపత్య పోరు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!