ప్రేమ పావురమా..స్నేహ గీతమా
ఏ ముహూర్తాన ఉదయ్ శంకర్ స్టార్ టీవీకి సీఇఓగా వచ్చాడో ఇక దాని స్వరూపమే పూర్తిగా మారి పోయింది. భారతీయ వినోద రంగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చేలా చేశాడు. అంతేనా ఏకంగా సౌత్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. తెలుగులో మాటీవీని భారీ డబ్బులు పెట్టి తీసుకున్నాడు. ఇంకేం ఎక్కడో ఉన్న దానిని ఇప్పుడు తెలుగు బుల్లి తెరపై దుమ్ము రేపేలా చేశాడు. అంతే కాదు డిఫ్ఫరెంట్ ప్రోగ్రామ్స్ కు ఊపిరి పోస్తోంది మా టీవీ యాజమాన్యం. జనరంజకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మా టీవీ. మొత్తం దాని రూపు రేఖలు హై రేంజ్ ను తలపింప చేస్తున్నాయి. అంతే కాదు పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంతో టాప్ పొజిషన్ కు చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ దుమ్ము రేపుతోంది. కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా ఆదరణ లో మాత్రం దూసుకెళుతోంది.
ఇదే సమయంలో బిగ్ బాస్ లోని పార్టిసిపెంట్స్ లలో కేవలం ఇద్దరిపైనే ఎక్కువగా ఫోకస్ అయ్యింది. వారెవ్వరు అంటే ప్రముఖ సింగర్ , తెలంగాణ పోరడు, యూత్ ఐకాన్ రాహుల్ సిప్లిగంజ్ ఉండగా మరొకరు వర్ధమాన నటి పునర్నవి భూపాళం. వీరిద్దరూ మొదట అంతగా మాట్లాడు కోలేదు. కానీ ఉన్నట్టుండి మెలమెల్లగా ప్రేమ పక్షుల్లా మారి పోయారు. వారి కార్యక్రమాలు కూడా మరింత దగ్గరకు చేర్చాయి. అన్నిటికంటే పునర్నవి ముద్దు ముద్దు మాటలు, రాహుల్ పాటలు ఆకట్టుకోగా..వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం కుర్రకారును, యూత్ ను మెస్మరైజ్ చేశాయి. ఒకానొక సమయంలో నాగార్జున వీరిపై చిలిపిగా కామెంట్స్ కూడా చేశారు. అంతే కాదు పునర్నవి ని పునర్నవి గారూ అంటూ పిలవడం బిగ్ బాస్ ప్రోగ్రాం కే హైలెట్ గా నిలిచింది.
ఆమె కూడా నాగార్జున గారూ అంటూ గోముగా పిలుస్తూ ఉంటే జనం రాహుల్, పునర్నవికి అనుకోకుండానే ఫిదా అయి పోయారు. మొత్తం మీద ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా ఎవరి వైపు వెళుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాగా బిగ్ బాస్ నుండి పునర్నవి ఎలిమినేటి కావడంతో ఒక్కసారిగా రాహుల్ సిప్లిగంజ్ షాక్ కు లోనయ్యాడు. అయితే వీరిద్దరి మధ్య మొదలైన ముద్దు సీన్ ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది. కెమిస్ట్రీ పండిందని, ప్రేమలో కూరుకు పోయారని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై పునర్నవి భూపాళం ఈజీగా తీసుకున్నారు. తాము స్నేహితులం మాత్రమే. ఎన్ని తిట్టినా రాహుల్ పడ్డాడు..అందుకే అతడంటే ఇష్టం. కానీ మీరంతా అనుకుంటున్నట్టు మామధ్య లవ్ అన్నదే లేదని చెప్పేసింది ఈ అమ్మడు. అయితే రాహుల్ మాత్రం తెరే మేరే బీచ్ మీ కైసాహే బంధన్ అంటూ పాడుకుంటున్నాడు. ఇదేనేమో ప్రేమంటే కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి