సౌత్ ఈస్ట్ ఏషియా నెట్ ఫ్లిక్స్ హెడ్ గా మైలీతా..ఇండియా జపం చేస్తున్న కంపెనీలు..!

ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా జపం చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ , మైక్రో సాఫ్ట్ , అడోబ్ , షావోమి , లాంటి కంపెనీలన్నీ భారతీయులకు పెద్ద పీట వేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాప్ రేంజ్ లో ఉన్న గూగుల్ కు మనోడే హెడ్. అలాగే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కు కేరాఫ్ గా ఉన్నారు. ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో టాప్ రేంజ్ లోకి తీసుకు వచ్చిన ఘనత భారతీయుడిదే. డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగి పోవడంతో ప్రతి ఐటి కంపెనీ ఈ సెక్టార్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ మార్కెట్ ఉన్నది చైనా, ఇండియా, అమెరికానే. దీంతో కంపెనీలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. డిజిటల్ ఫార్మాట్ లో ఎక్కువగా మార్కెట్ వాటా కలిగి ఉన్నది అమెజాన్, నెట్ ఫ్లిక్స్ , గూగుల్ ప్లస్ , ప్రో తమ హవా కొనసాగిస్తున్నాయి. ఇక స్టార్ టీవీ గ్రూప్ ఏకంగా డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా హాట్ స్టార్ ను స్టార్ట్ చేసింది. తాజాగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఇదే రంగం లోకి ఎంటర్ అయ్యేందుకు పావులు కదుపుతోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ యాపిల్. వీడియో స్ట్రీమింగ్ రం...