ఏపీలో గరం గరం తారాస్థాయికి చేరిన రాజకీయం
ఏపీలో
రాజకీయాలు తార స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పాలిటిక్స్ సాగుతున్నాయి. దేశ రాజకేయాలలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా, అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నారా చంద్ర బాబు నాయుడు. తొమ్మిది ఏళ్ళ పాటు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ఆయన సీఎం గా పని చేశారు. ఆయన హయాంలో రైతులపై కాల్పులు జరిగాయి. ఇదే సమయంలో తీవ్ర కరువు నెలకొనడం, తెలంగాణపై ఆధిపత్యం చెలాయించడం, వందలాది మందిని నక్సల్స్ పేరుతో కాల్చి చంపడం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీంతో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ కూడా ఇదే ధోరణి అవలంభించారు.
నక్సల్స్ ను చర్చల పేరుతో ఆయన కూడా నెత్తురు పారించాడు. ఇదే సమయంలోతెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ప్రపంచం నివ్వెర పోయేలా పోరాటం జరిగింది. కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించింది. అయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆశించినంత స్పందన రాలేదు. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్, బీజేపీతో దోస్తీ కారణంగా అధికారంలోకి వచ్చారు చంద్ర బాబు. ఇదే సమయం లో కాంగ్రెస్ పై పోరాటం చేసి దాని నుంచి బయటకు వచ్చారు జగన్. దాదాపు మూడేళ్ళ పాటు ఏపీలో పాదయాత్ర చేపట్టారు. ఏపీలో సక్సెస్ అయ్యారు. భారీ మెజారిటీతో పవర్ లోకి వచ్చారు. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమై పోయింది. బాబుకు సపోర్టుగా వున్న సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరారు. జగన్ మోహన్ రెడ్డి చంద్ర బాబు ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేసుకున్నారు. బాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులపై విచారణకు ఆదేశించారు జగన్. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక తాజాగా పల్నాడు వ్యవహారం మరింత అగ్గిని రాజేసింది. బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బాబును గృహ నిర్బంధం చేశారు. సీనియర్ నేతలు చెప్పినా పట్టించు కోలేదు. నన్నపనేని రాజకుమారి, కోడెల, లాంటి తదితర నేతలపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. ఇంకా జగమొండి జగన్ మోహన్ రెడ్డి మనసులో ఎందరున్నారో తెలియడం లేదు. చంద్ర బాబు మాత్రం తాను తగ్గే పరిస్థితి లేదంటూ మండి పడ్డారు. కేంద్రంలో మోడీతో బాబు ఢీకొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టారు. ఒకానొక సమయంలో కేసీఆర్, బాబు ల మధ్య వార్ నడిచింది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ఘాటుగా కామెంట్స్ చేశారు. జగన్ మాత్రం చాప కింద నీరులా తన బలగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి ఊరును తన గుప్పిట్లో తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు చంద్ర బాబు యుద్ధానికి రెడీ అంటున్నారు. మొత్తం మీద ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం టెన్షన్ కు లోనవుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి