బాబు గృహ నిర్బంధం..ఛలో ఆత్మకూరు ఉద్రిక్తం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. తనను ఏ శక్తి అడ్డుకోలేదని, తాను ఆత్మకూరు కు వెళ్లడం ఖాయమన్నారు. ఇది చీకటి రోజుగా బాబు అభివర్ణించారు. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై మండి పడ్డారు. పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేక పోయింది. దాదాపు గంటకు పైగా బాబు కారులోనే వుండి పోయారు. మాజీ సీఎం ఇంటి తలుపులకు తాళ్లతో బిగించారు. శాంతియుతంగా తాము వెళుతుంటే అధికార పార్టీ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భాదితులకు అండగా ఉండేందుకు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి బాబు పిలుపునిచ్చారు. పెద్దఎత్తున పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు బాబు వెంట ఉన్నారు. ఆత్మకూరు కు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఇవ్వాళ కాక పోయినా, రేపైనా సరే తాను వెళ్లడం ఖాయమన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంపై బాబు ఫైర్ అయ్యారు. టీడీపీ ఛలో ఆత్మకూర్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు సైతం...