అమెరికాలో జెండా ఎగరేసిన ఓయో

హాస్పిటాలిటీ సెక్టార్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ఓయో ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాలోకి ఎంటరైంది. ప్రపంచమంతా అమెరికా జపం చేస్తుంటే ఇండియాకు చెందిన రితీష్ అగర్వాల్ హోటల్ రంగం విస్తు పోయేలా చేశాడు. ఒక భారతీయుడు సాధించిన అపూర్వ విజయం ఇది. ఇండియన్ మార్కెట్ ను చైనా కంపెనీలు డామినేట్ చేస్తుంటే మనోడి ఓయో చైనా హోటల్స్ ను ఓన్ చేసుకుంది. ఇది కూడా ఓ రికార్డ్. అమెరికాతో పాటు లాటిన్ అమెరికా కంట్రీస్ కు కూడా ఓయో వ్యాపారాన్ని విస్తరించాలని డెసిషన్ తీసుకున్నారు. ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ ప్రతి చోటా ఓయో తప్పక వుండి తీరుతుంది. హోటల్స్ మరింత ఆకర్షణీయంగా, అన్ని సౌకర్యాలు ఉండేలా తీర్చి సిద్ధేందుకు ఓయో డబ్బులు కూడా సమకూర్చుతోంది యజమానులకు.

500 సిటీస్ లలో 4 50 000 ఉన్నాయి. ఇండియాతో పాటు శ్రీలంక, చైనా, మలేషియా , యుకె , అమెరికా, యూఏఈ , సౌదీ అరేబియా, ఫిలిపైన్స్ , ఇండోనేషియా, వియత్నాం, జపాన్ దేశాలకు విస్తరించేలా చేశాడు రితీష్ అగర్వాల్ . ఓయో వ్యాపారం ద్వారా రోజుకు కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. హర్యానాలోని గూర్గావ్ కేంద్రంగా అంకుర సంస్థగా ఓయోను స్టార్ట్ చేశాడు రితీష్ . ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు దేశం దాటి విదేశాలకు విస్తరించింది దీని వ్యాపారం. ఓయో కొట్టిన దెబ్బకు అప్పటి వరకు డామినేట్ చేస్తున్న ఫైవ్ , త్రీ స్టార్ హోటల్స్ కు దెబ్బ పడింది.

ఓయో వ్యాపారాన్ని అడ్డుకోలేక చతికిల పడ్డాయి బడా హోటల్స్. 2012 లో కేవలం 18 ఏళ్ళ వయసున్నప్పుడు రితీష్ హోటల్స్, లాడ్జ్ లను బుకింగ్ చేసే సైట్ రూపొందించాడు. అదే ఇప్పుడు ఓయోగా మారింది. వేలాది మందికి కూడు పెడుతోంది. ప్రస్తుతం లేటెస్ట్ టెక్నలాజిని వాడుతోంది ఓయో. అమెరికాలో పేరున్న హూటర్స్ కాసినో హోటల్స్ ను కొనుగోలు చేశాడు. ఇదంతా రెంటల్ బిజినెస్. మిడిల్ ఈస్ట్ , సౌత్ ఈస్ట్ , ఏషియా , యూరప్, అమెరికాలో ఓయో ను విస్తరించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉందంటున్నారు రితేష్. ప్రస్తుతం మెక్సికోలో స్టార్ట్ చేసిన ఓయో అమెరికాను షేక్ చేసేందుకు రెడీ అవుతుందన్న మాట. డిఫరెంట్ గా అలోచించి పని చేస్తే సక్సెస్ వస్తుందంటారు రితీష్.  

కామెంట్‌లు