టాలీవుడ్ కు మోదీ బంపర్ ఆఫర్

నిన్నటి దాకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఓ దుర్భేద్యమైన ప్రాంతం. అక్కడ తుపాకుల మోత, దాడులు, బాంబులు, ఉగ్రమూకల చప్పుళ్ళు తప్పా ఇంకేమీ లేదనుకునే వాళ్ళం. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర స్వంతం చేసుకున్న ఆ ప్రాంతం భారత దేశంలో అంతర్భాగమేనని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆ ప్రాంతానికి రక్షణ కవచంగా ఉన్న 370 వ ఆర్టికల్  ను రద్దు చేస్తూ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు భారత ప్రధానమంత్రి మోదీజీ. ఈ మేరకు ఇది తమకు చెందిన ప్రాంతం. ఇందులో ఏ ఒక్కరికి కానీ లేదా దాయాది దేశానికి ఇసుమంత అధికారం లేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఒక్క చైనా తప్పా ఏ ఒక్క దేశమూ పాకిస్థాన్ కు మద్దతు తెలపలేదు. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా భయపడలేదు. 

ఇలాగే పిచ్చి చేష్టలు చేస్తే గనుక యుద్ధం చేసేందుకైనా తాము సిద్డంగా ఉన్నామని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఇది ముమ్మాటికీ ఈ దేశ ప్రజలది. ఇక్కడి ప్రతి నీటి బొట్టు , పిడికెడు మట్టి కూడా ఇండియాలోనిదే. కాదని ముందుకు వస్తే కాలు దువ్వడానికి సై అంటూ సవాల్ విసిరారు మోదీ. ఇన్నేళ్ళుగా జమ్మూ కాశ్మీర్ ను అడ్డంగా చూపి పాకిస్తాన్ ప్రపంచ వేదికపై నాటకాలు ఆడుతూ వస్తున్నది. ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ , హింసోన్మాదంతో దేశాన్ని అస్థిర పరిచే ఉద్దేశంతో కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే చేసిన నష్టం చాలు. ఇక పాకిస్తాన్ తన తీరును మార్చుకోక పోతే చివరకు అణుబాంబు ను ప్రయోగించేందుకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇదే సమయంలో భారత జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక స్వేచ్ఛగా మీరు ఉండవచ్చు. మీరు ఈ ప్రపంచంతో పోటీ పడేందుకు కృషి చేయాలి. అందుకు నా వంతు సహకారం మీకు ఎల్లపుడూ ఉంటుంది. 

ఈ జామూ కాశ్మీర్ అందాలకు, ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. మీరు పుట్టుకతోనే అందమైన వారీగా పేరు తెచ్చుకున్నారు. మీ వెంట ఈ దేశం ఉంటుందని హామీ ఇస్త్తున్నా. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు బడా కంపెనీలు ముందుకు రావాలి. ఇక్కడ విరివిగా దొరికే పండ్లు, దినుసులు ఇతర దేశాలకు ఎగుమతి కావాలి అని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఈ ప్రాంతపు అందాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్, తెలుగు సినిమాలకు చెందిన వారంతా తరలి రావాలని, ఇక్కడ షూటింగ్స్ జరుపుకోవాలని అందుకోసం కేంద్ర ప్రభుత్వం కావాల్సినవన్నీ సమకూరుస్తుందని చెప్పారు. ఇక్కడే సినిమాలు నిర్మాణం జరుపుకునేలా స్టూడియోలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

స్టూడియోలు పెట్టడానికి అవసరమైన స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మోడీ ప్రకటించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. కశ్మీర్, లద్ధాఖ్‌లలో ఇక నుంచి షూటింగ్స్ బాగా చేయండి. బాలీవుడ్ తర్వాత ఎక్కువ సినిమాలు నిర్మించే తెలుగు సినిమా పరిశ్రమను ఆహ్వానిస్తున్నాను. మీరు షూటింగ్స్ అక్కడ ఎక్కువగా చేసుకోండి. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌ల అభివృద్ధిలో భాగం కండి. స్టూడియోలు పెట్టడానికి స్థలాలు కూడా ఇస్తాం. దర్శక నిర్మాతలు ఈ విషయంపై ఆలోచించండి అని కోరారు. తాజాగా కేంద్ర సహాయ హోమ్ శాఖా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్ కు చెందిన వారు  ముందుకు రావాలన్నారు. ఇందు కోసం సులభంగా అనుమతులు  ఇచ్చేలా చూస్తామన్నారు.  సింగిల్ విండో పద్దతిని అమలు చేస్తామన్నారు. మొత్తం మీద కోట్లు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్లే బదులు జిమ్మో కాశ్మీర్ లో స్టూడియోలు పెడితే బావుంటుంది కదూ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!