జోరుమీదున్న బీజేపీ..డిఫెన్స్ లో కాంగ్రెస్

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడి కొట్టు మిట్టాడుతోంది. ఎన్నడూ లేనంతగా నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు వద్దంటూ వుండి పోతే ప్రియాంక గాంధీ మాత్రం మోడీని టార్గెట్ చేస్తోంది. చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేసే పనిని భుజాలకు ఎత్తుకుంది తల్లి సోనియా గాంధీ. ఎన్నడూ లేనంతగా ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. రాహుల్ నేతృత్వంలో ఇది జరగడంతో ఆయన పూర్తిగా పార్టీకి కొంత కాలం దూరంగా ఉన్నారు. దేశ పరిస్థితులను, రాజకీయ నేపథ్యాన్ని, ఆయా ప్రాంతాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఆ పార్టీ అధిష్టానం అంచనా వేయలేక పోయింది. ఎంత సేపు బీజేపీ దాని పరివారాన్ని , మోడీ , అమిత్ షా లను టార్గెట్ చేస్తూ పోయారు తప్పా , గ్రాస్ రూట్ లెవల్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేక పోయారు.

అంతే కాకుండా బీజేపీ పక్కా ప్లాన్ తో చాప కిందా నీరులా తన కేడర్ ను బలోపేతం చేసుకుంటూ వెళితే కాంగ్రెస్ తుమ్మితే ఊడిపోయే పదవులను కట్టబెడుతూ విలువైన కాలాన్ని నిర్వీర్యం చేసింది. ఊహించని రీతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. కనీసం లోక సభలో అధికారాన్ని చేజిక్కించుకోలేక పోగా ఉన్న హోదాను దూరం చేసుకుంది. ఇదంతా నాయకత్వ లోపం. అంతే కాకుండా కొందరిని నమ్ముకుని అనుభవ లేమితో తీసుకున్న నిర్ణయాలు, సీనియర్ల రాజకీయాలు పార్టీని కోలుకోలేకుండా చేశాయి. మొన్నటికి మొన్న రాజ్యసభలో మెజారిటీ ఉన్నప్పటికీ బీజేపీ ఏకంగా తాను అనుకున్నట్లుగానే జమ్మూ , కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ ను రద్దు చేసే చట్టాన్ని పాస్ చేసేలా పావులు కదిపింది. ఏ కోశానా కేంద్ర సర్కార్ ను ఢీకొనే స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ లేదు. పార్టీకి అండగా ఉన్నవారిని బీజేపీ టార్గెట్ చేస్తోంది.

అందులో భాగంగానే చిదంబరం, కమలనాథ్, డీకే శివకుమార్ ...ఇలా ఇంకా ఎందరినో జైలుకు పంపించే యోచనలో ఉంది. ఇదే సమయంలో పార్టీ నుంచి నేతలు బీజేపీకి క్యూ కట్టారు. ఇక మూడు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. బీజీపీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. పెద్ద ఎత్తున మోడీ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హర్యానా , ఝార్ఖండ్ , మహారాష్ట్ర లలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఇప్పటికే పవర్లో ఉన్నవే ఇవి. అయినా మరింత మెజారిటీ సాధించి తమ సత్తా చాటాలని మోడీ అండ్ అమిత్ షా టార్గెట్ గా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ను నామ రూపాలు లేకుండా చేయాలన్నదే వీరి ఉద్దేశం. ఇప్పటికే బీజేపీ తన బలగాన్ని రెడీ చేసింది. అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసింది. ఆఖరు నిమిషంలో ఏదైనా మార్పులు ఉండేలా కూర్పు చేసింది. మొత్తం అమిత్ షా ముందుండి నడిపిస్తున్నారు. ఇక మిగతా పార్టీలను బీజేపీ లెక్కలోకి తీసుకు కోవడం లేదు. ఎలాగూ దేశమంతటా బీజేపీ హవా నడుస్తోందని , ఇక ఇక్కడ కూడా మరోసారి జెండా ఎగరేస్తామనే నమ్మకంతో ఉన్నారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!