రా రమ్మంటున్న పాకిస్థాన్..సై అంటున్న ఇండియా
దాయాది దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ కారాలు మిరియాలు నూరుతోంది. ప్రపంచ వేదిక మీద భారత్ పై దాడికి దిగుతోంది. పాక్ కుట్రలను సమర్ధవంతంగా భారత్ తిప్పి కొడుతోంది. అయినా పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. యుద్దానికి రెడీగా ఉన్నామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడో ప్రకటించారు. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ , కాశ్మీర్ అన్నది భారత్ కు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఐక్య రాజ్య సమితి లో శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ ఘాటుగా సమాధానం చెప్పారు. ఇండియా పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరో వైపు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా పేరొందిన మసూద్ అజర్ ను ఇటీవలే పాకిస్తాన్ విడుదల చేసింది.
మరో వైపు అమెరికా పర్యటన సమయంలో ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో మితిమీరిన తీవ్రవాదులు ఉన్నారని స్వయంగా ఆరోపించారు. మరోసారి తన అక్కసును ఇండియాపై కక్కుతూనే ఉన్నారు. కాశ్మీర్ పై పదే పదే ఆరోపణలు చేస్తున్న పాక్ అంతర్జాతీయ స్థాయిలో ఒంటరిగా మిగిలింది. ఒక్క చైనా దేశం మినహా ఏ దేశమూ పాక్ కు మద్దతు ప్రకటించలేదు. అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా సైతం భారత్ కు , మోడీకి మద్దతు తెలిపాయి. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది పాక్ . రా రమ్మంటూ పిలుస్తోంది. అయితే ఎప్పుడైతే భారత ఆంతరంగిక భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ బాధ్యతలు తీసుకున్నారో ఇక అప్పటి నుంచి పాకిస్థాన్ లో వణుకు మొదలైంది. దీంతో వాస్తవాధీన రేఖ వెంట పాకిస్థాన్ తన బలగాలను మోహరించింది. జమ్మూ, కాశ్మీర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇండియా.
దేశంలో అస్థిరపరిచే కుట్రలకు పాక్ తెరతీసిందని జాగ్రత్తగా ఉండాలని ఐబి సూచించింది . కాశ్మీర్ లో స్పెషల్ స్టేటస్ కొనసాగించాలని పాకిస్థాన్ పట్టుపడుతోంది. అయితే వాస్తవానికి పాకిస్థాన్ లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్నది. ఉగ్రవాదులు, దాడులు, నిత్యం ఇబ్బందుల మధ్య సర్కార్ నడుస్తోంది. దీనిని కప్పి పుచ్చుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. అయితే మసూద్ అజర్ ను అరెస్ట్ చేశామని , అనారోగ్యంతో బాధ పడుతున్న అజర్ ను జైల్లోనే ట్రీట్ మెంట్ ఇస్తున్నామని చెప్పిన పాక్ మాటలు ఉత్తివేనని తేలిపోయింది. అజర్ ను అరెస్ట్ చేసినట్టు చేసి రహస్యంగా విడుదల చేసినట్లు తమకు సమాచారం అందిందని ఇండియన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. దీంతో పాక్ అసలు స్వరూపం ప్రపంచానికి తెలిసి పోయింది. మొత్తం మీద పాకిస్తాన్ కు ఝలక్ ఇవ్వాలని దోవల్ రెడీ గా ఉన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి