పోస్ట్‌లు

డిసెంబర్ 9, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బిల్లుపై భిన్నాభిప్రాయం

చిత్రం
ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిషష్టాత్మకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై యూఎస్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషన్‌ రిలీజియన్‌ ఫ్రీడమ్‌ స్పందించింది. ఈ బిల్లును పౌరుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ బిల్లును తప్పుడు దిశగా వెళ్తున్న ప్రమాదకరమైన మలుపుగా వర్ణించింది. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందింతే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షాతో పాటు కీలక నేతలపై ఆంక్షలను పరిశీలించాలని సూచించింది. లౌకిక దేశంగా ఘనమైన చరిత్ర కలిగిన భారతదేశంలో.. మత ప్రతిపాదికన విభజన జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఇటీవల అస్సాంలో అమలు చేసిన ఎన్‌ఆర్సీపై కూడా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ స్పందించిన విషయం తెలిసిందే. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్‌ఆర్సీని రూపొందించారని అభిప్రాయ పడింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో, మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం ...

డబ్బులు మాయం..ఖాతాదారులు భద్రం

చిత్రం
కస్టపడి దాచుకున్న డబ్బులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మోసాలకు కేరాఫ్ గా మారాయి. తాజాగా దేశీయ అతి పెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌ ఇచ్చింది. ఎస్‌బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ‍్యంగా మాయమై పోతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నకిలీ చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో ఎస్‌బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్ద మొత్తంలో ఉన్న నాన్‌ హోం చెక్కుల క్లియరింగ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ సమాచారాన్ని తన బ్రాంచీలకు అందిస్తోంది. వివరాల్లోకి వెళితే, ఎయిమ్స్‌ కు చెందిన ఎస్‌బీఐ రెండు ఖాతాల్లోని 12 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి 7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరో ఖాతా నుంచి మరో 5 కోట్ల నగదు అక్రమంగా తరలి పోయాయి. గత రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది. అ...

హైదరాబాద్‌లో టీవీల అసెంబ్లింగ్‌

చిత్రం
స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న మోటరోలా, నోకియా, వన్‌ప్లస్‌ వంటి దిగ్గజ సంస్థలు ఎల్‌ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విశేషమేమంటే ఈ కంపెనీల టీవీలు హైదరాబాద్‌లో రూపుదిద్దు కుంటున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో ఉన్న స్కై క్వాడ్‌ ఇప్పటికే ప్యానా సోనిక్, లాయిడ్‌ వంటి ఏడు బ్రాండ్ల టీవీలను అసెంబుల్‌ చేస్తోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్, శంషాబాద్‌ వద్ద ప్లాంట్లున్నాయి. ఏటా 30 లక్షల ఎల్‌ఈడీ టీవీలను రూపొందించే సామర్థ్యం ఉంది. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారని కంపెనీ ఎండీ రమీందర్‌ సింగ్‌ సోయిన్‌ వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో నాలుగు కొత్త బ్రాండ్లు తోడవనున్నాయని వివరించారు. స్కైక్వాడ్‌ భాగస్వామ్యంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ స్కైవర్త్‌ శంషాబాద్‌ వద్ద 50 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో 700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఇరు సంస్థలు కలిసి టీవీలతోపాటు వాషింగ్‌ మెషీన్లు, డిష్‌ వాషర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను అసెంబుల్‌ చేస్తాయని వెల్లడించారు. ఆరు నెలల్లో ఈ...

ఆదుకోక పోతే మూయడమే

చిత్రం
కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్య లేమీ తీసుకోక పోతే కంపెనీని మూసి వేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్‌, ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. సంస్థను మూసేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ఎకానమీని గాడిలో పెట్టే దిశగా.. సంక్షోభంలో ఉన్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టెలికం అనేది చాలా కీలక రంగమని ప్రభుత్వం గుర్తించింది. మొత్తం డిజిటల్‌ ఇండియా కార్యక్రమమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నిలదొక్కు కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి..సర్కారు నుంచి మరింత తోడ్పాటు అవసరం అని ఆయన చెప్పారు. ఏ రకమైన ఊరట చర్యలు కోరుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ..ప్రధానమైన సమస్య.. సవరించిన స్థూల ఆదాయం  వివాదమే. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ప్రభుత్వమే టెల్కోలకు వ్యతిరేకంగా ఈ కేసు వేసింది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు అని బిర్లా పేర్కొన్నారు. ఏజీఆర్‌ లెక్కింపు వివాదంలో ఇటీవల...

తమిళనాడుకు బంపర్ ఛాన్స్

చిత్రం
ప్రపంచ భౌగోళిక చిత్రపటంలో తమిళనాడు సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. అంతరిక్ష ప్రయోగాలకు ఏకైక కేంద్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సరసన తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిలో ప్రతిష్టాత్మకంగా రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో రెండు లాంచింగ్‌ ప్యాడ్‌లు ఉన్నాయి. భవిష్యత్తులో మరో రెండు లాంచింగ్‌ ప్యాడ్‌లు అవసరమని భావిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి అనువైన భూమికోసం అన్వేషించారు. ఈ ప్రాంతం అనుకూలమని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. 3, 4 లాంచింగ్‌ ప్యాడ్‌లను నిర్మించేందుకు కేంద్రం సైతం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాల్లో గత వారం కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ఈ విషయాన్ని నిర్ధారించారు. కులశేఖరపట్టి అంతరిక్ష ప్రయోగాల నుంచి చేసే ప్రయోగాలతో ఎన్నో లాభాలున్నాయి. శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేసేటపుడు వాహక నౌకను దక్షిణం వైపునకు మాత్రమే పయనింప జేయాల్సి ఉంది. అయితే దక్షిణం వైపున శ్రీలంక దేశం ఉంది. అంతరిక్ష ప్రయోగాలు చేసేపుడు...

వారెవ్వా..వివో

చిత్రం
స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకునేలా మొబైల్ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ను తయారు చేస్తున్నాయి. అంతే కాకుండా అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో ఉండేలా ఎప్పటికప్పుడు చూస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఒక రకంగా కొనుగోలుదారులకు పంట పండుతోంది. ఇప్పటికే ఇంటర్ నేషనల్ మొబైల్స్ మార్కెట్ లో అత్యధిక వాటాను చైనా మొబైల్ తయారీ కంపెనీలే చేజిక్కించుకున్నాయి. తాజాగా షావోమి కంపెనీ కొట్టిన దెబ్బకు దిగ్గజ మొబైల్ కంపెనీలు యాపిల్, శాంసంగ్ లు లబోదిబోమంటున్నాయి. రోజుకో వేరియంట్ తో, అందరికీ అందుబాటు ధరల్లో మొబైల్స్ ను లాంచ్ చేసుకుంటూ పోతోంది ఈ కంపెనీ. ఇటీవలే రిలీజ్ చేసిన షావోమి - 8 మొబైల్ ఇండియాలో రికార్డు స్థాయిలో అమ్ముడు పోతోంది. కేవలం 10 వేల రూపాయల లోపు ఉండే ఈ ఫోన్ లో లెక్కలేనన్ని ఫీచర్స్ ఉన్నాయి. దీంతో మార్కెట్ లో నో స్టాక్ అన్న బోర్డు కనిపిస్తోంది. ఇప్పటికే 11 లక్షలకు పైగా మొబైల్స్ ను అమ్మింది షావో మీ. ఇక చైనాకు చెందిన మరో కంపెనీ వివో కూడా తన మార్కెట్ వాటాను పెంచుకునే పనిలో పడ్డది. తాజాగా వీవో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తన వి సీరిస్‌లో భాగంగా  వివో వి 17 స్మార్ట్‌ ఫోన్‌ను...

హస్తానికి రెవెన్యూ..ఎన్సీపీకి హోమ్

చిత్రం
మహారాష్ట్రలో కొలువు తీరిన సంకీర్ణ సర్కార్ పాలనను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడి కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ, ఎన్సీపీకి హోం శాఖలు కేటాయించేలా అడుగులు పడుతున్నట్లు సమాచారం. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మహా వికాస్‌ ఆఘాడి కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపై ఒక స్పష్టత రాక పోవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోందని తెలుస్తోంది. దీంతో నాగ్‌పూర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కేవలం ఐదు రోజులపాటు సాగే ఈ సమావేశాలు పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందులో శివసేనకు నగరాభివృద్ధి శాఖ, ఎన్సీపీకి హోం శాఖ, కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ కట్టబెట్టే సూచనలున్నాయి. మహా వికాస్‌ ఆఘాడి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే కొనసాగుతున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పక్షం రోజులు కావస్తోంది. ఆ సమయంలో ఉద్ధవ్‌తో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ...

కన్నడ కేబినెట్ లో ఛాన్స్ ఎవ్వరికో

చిత్రం
కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ సర్కార్ తన సత్తాను చాటింది. అయితే సర్కారు ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని సాధించి పెట్టారు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప. అయితే భారీ విజయాలను నమోదు చేసుకున్నప్పటికీ, గెలుపొందిన వారిలో ఎవరికి కేబినెట్ లో చోటు కల్పించాలో తెలియక యెడ్డీలో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉండగా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రకటించారు. ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేయగా 11 మంది విజయం సాధించారు. వారందరికీ మంత్రి పదవులు ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. వారికి కేబినెట్‌లో చోటిస్తే బీజేపీలో సీనియర్‌ నేతలు భగ్గుమనే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఓడిన ఎంటీబీ నాగరాజు, హెచ్‌.విశ్వనాథ్, టికెట్‌ దక్కని ఆర్‌.శంకర్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఖాళీలు లేవు. ఉప ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారిన బెళగావి జిల్లా రాజకీయాలు ఫలితాల అనంతరం కూడా వేడిగానే ఉన్నాయి. జిల్లా నుంచి ప్రస్తుతం లక్ష్మణ సవది మంత్రివర్గంలో ఉన్నారు. అయితే మరో ముగ్గురు రమేశ్‌ జార్కిహోళి, శ్రీమంతపాటిల్, మ...

చేదెక్కిన..చక్కెర

చిత్రం
ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతుంది. ఆటు పోట్లు..ఒడిదుడుకులు..లాభనష్టాలు బిజినెస్ లో మామూలే. ప్రస్తుతం చక్కెర విషయంలో ఇదే రిపీట్ అవుతోంది. వినియోగం తగ్గడం..ఉత్పత్తి భారీగా పెరగడంతో చక్కెర నిల్వలు ఎక్కడికక్కడ పేరుకు పోతున్నాయి. చక్కెర రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చక్కెర నిల్వలు పేరుకు పోయాయి. ప్రకృతి కూడా ఈసారి కన్నెర్ర చేసింది. దీంతో ఆరుగాలం కష్టించి సాగు చేసిన చక్కెర పంట పూర్తిగా పాడై పోయింది. ఇదిలా ఉండగా పంట విషయంలో ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు రైతులను ఆదు కోవడం విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఇదే సమయంలో పంటకు నష్టం వాటిల్లడంతో దిగుబడి తగ్గింది. ఇండియా నుంచి పంచదార ఎగుమతులు గత సీజన్లో 44 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. కాకపోతే ఎగుమతి ప్రోత్సాహకాల తాలూకు బకాయిలు ఏడాదిగా నిలిచి పోయాయి. దీంతో ఈ ఏడాది ఎగుమతులపై కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. రికార్డు స్థాయిలో 332 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయింది. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలలో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉంటోంది. దేశంలో చాలా చోట్ల కం...

మానవాభివృద్ధిలో ఇండియా వెనుకంజ

చిత్రం
సామాజిక, రాజకీయ, ఆర్ధిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో వెనుకబాటుకు గురైన ఇండియా తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో పూర్తిగా వెనుకబడి పోయింది. ఓ వైపు నమో నమామి మోదీ సునామీ అంటూ ఊదర గొడుతున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ నివేదిక ఓ చెంప పెట్టు లాంటిది. సర్కారు పని తీరుకు ఇది నిదర్శనం. ఇప్పటికే ఆర్ధిక మందగమనంలో ఉన్న ఈ దేశానికి ఓ హెచ్చరిక కూడా. నిరుద్యోగం పెచ్చరిల్లి పోయింది. దారుణాలు, ఆర్ధిక నేరాలు చోటు చేసుకుంటున్నా అడిగే దిక్కే లేకుండా పోయింది. పట్ట పగలు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డోంట్ కేర్ అంటున్నాయి. జవాబుదారీ తనం చూద్దామంటే అగుపించడం లేదు. ఇక తాజాగా ప్రకటించిన జాబితాలో భారత్‌ 129వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి..ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం నివేదిక – 2019ను విడుదల చేసింది. తొలి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్‌ నిలిచాయి. పాకిస్తాన్‌ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189 స్థానంలో నైగర్‌ ఉంది. 189 దేశాలతో జాబితా రూపొందించింది. 2005–06 నుంచి 2015–16 వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడినట్టు యూఎ...

బైపోల్ లో బీజేపీ హవా

చిత్రం
కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. విపక్ష జేడీఎస్‌, కాంగ్రెస్‌ మిగిలిన స్థానాల్లో స్వల్ప ఆధిక్యం సాధించాయి. ముందుగా ఊహించినట్లుగానే బీజేపీకి అనుకూలంగా తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇక శాశ్వతంగా సమసి పోయినట్లే అని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపేలా ఉన్నాయి. యడ్డీ సర్కార్‌ నిలబడాలంటే15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు విజయం సాధిస్తే చాలు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియూరప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదన...