ఒప్పుకుంటే ఓకే..లేకపోతే జైలుకే

ఈ దేశంలో ఒకప్పుడు రాజయాల్లో ఒక వెలుగు వెలిగిన అధినాయకులు నిద్ర పోవడం లేదు. ఎప్పుడు ఐటీ, సిబిఐ దాడులు చేస్తుందోనని భయాందోళనకు లోనవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్స్ ను సైతం వదలడం లేదు మోదీ, అమిత్ షాలు. రాబోయే ఎన్నికల్లో సైతం బీజేపీకి ఎదురే లేకుండా చేయాలన్నదే వీరిద్దరి టార్గెట్. అందులో భాగంగానే దేశమంతటా దాడులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు దేశంలో చక్రం తిప్పిన చిదంబరం, కర్ణాటకలో చక్రం తిప్పిన నేతగా పేరున్న డీకే శివకుమార్ లను జైలుకు పంపించారు. ఇవ్వాలో రేపో కాంగ్రెస్ టాపర్స్ అందరినీ బోను ఎక్కించాలని కంకణం కట్టుకున్నారు. ఢిల్లీ హైకోర్టు డీకేకు బెయిలు వెసలుబాటు కల్పించగా చిదంబరం మాత్రం అండమాన్ జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. దేశమంతటా ఒకే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మోదీ,షా. ఆయా రాష్ట్రాలలో విపక్షాలు అంటూ లేకుండా చేయడంలో భాగంగా ముఖ్యమైన నేతలను టార్గెట్ చేయడం. వారు పార్టీలో చేరుతారా లేక పాత కేసులు, ఐటి దాడులు, సిబిఐ రంగంలోకి దిగడం మామూలే పోయింది. తాజాగా మరాఠాలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ పై ఇదే ప్రయోగం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోనే అజిత్ బేషరత్తుగ...