ఫలించిన వ్యూహం..దేశం ఉత్కంఠ భరితం


మరాఠాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్‌ పవార్‌ బీజేపీకి మద్దతు ప్రకటించారు. పవార్‌కు తెలియ కుండా పార్టీని నిలువునా చీల్చి ఎమ్మెల్యేలతో బీజేపీతో చేతులు కలిపారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీని వెనుక మోదీతో పాటు  మంత్రి అమిత్‌ షాల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రేను అజిత్‌ వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న బీజేపీ, శివసేనకు చెక్‌ పెట్టాలని డిసైడ్ అయ్యింది. పకడ్బందీ ప్రణాళిక రచించింది. ప్రధాని మోదీతో శరద్‌ పవార్‌ భేటీ కావడం, ఆయనపై ప్రసంశలు కురిపించారు.

బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటిస్తే, పవార్‌కు రాష్ట్రపతి పదవిని కేంద్రం ఆఫర్‌ చేసిందనే పుకారు షికారు చేసింది. కానీ వీటన్నింటినీ పవార్‌ కొట్టి పారేశారు. ఎలాంటి చర్చ జరగలేదని, రైతుల ఆత్మహత్యల పైనే చర్చించామన్నారు. వీరి మధ్య భేటీ సమయంలో మోదీ, పవార్‌ తప్ప మూడో వ్యక్తి లేక పోవడంతో ఊహాగానాలు మరింత వ్యక్తమయ్యాయి. దీనిని పటాపంచలు చేస్తూ ఉద్దవ్ థాక్రే నే మరాఠా సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంత లోపే ఎన్సీపీ నేత అజిత్‌ను తమ వైపు నకు తిప్పుకున్నారు ట్రబుల్ షూటర్లు.

కర్ణాటక, గోవా అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న షా, మోదీ ఇక్కడ కూడా అలాంటి వ్యూహాలనే అమలు చేసింది. సీఎం పీఠంపై బీజేపీతో వైరాన్ని సృష్టించిన శివసేనకు గట్టి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు షా..ఆ ప్రయోగాన్ని అజిత్‌పై ప్రయోగించారు. ఈడీ కేసులను చూపి షా గాలం వేసినట్లు సమాచారం. తాజా పరిణామాలు ఎన్సీపీ, శివసేనకు ఎదురు దెబ్బగా రాజకీయ మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలవడం శివ సేన సైనికులు జీర్ణించు కోలేక పోతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.

కామెంట్‌లు