ఎంఎస్‌ఎంఈలకు మహర్దశ
కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చే దిశగా చర్యలు చేపడుతోంది. గ్రామీణ. పట్టణాల్లో స్వంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసింది. ఇందు కోసం కోట్లాది రూపాయలు కేటాయించింది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు బ్యాంకుల ద్వారా రుణాలు అంద జేస్తోంది. వీటి ద్వారా ఎంఎస్‌ఎంఈలు మరింత ముందడుగు వేస్తున్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. పలు రకాల చర్యలు చేపట్టడం తో ఎంఎస్‌ఎంఈలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఏర్పడుతోంది. జీఎ్‌సటీ రిజిస్టర్డ్ ఎంఎస్‌ఎంఈల కోసం 2019 బడ్జెట్‌లో ప్రభుత్వం 2 శాతం వడ్డీ రాయితీకి గాను 350 కోట్లు కేటాయించింది.
5,000 కోట్లతో స్ట్రెస్డ్ అసెట్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎంఎ్‌సఎంఈ రంగం మరింత మెరుగ్గా రుణ సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని ఇటీవలే ఆర్‌బీఐ నివేదిక సూచించింది. గత రెండేళ్ల కాలంలో సిబిల్ ర్యాంక్, ఎంఎస్‌ఎంఈలు తమకున్న రుణ ప్రత్యామ్నాయాలను అర్థం చేసు కోవడానికి, వేగవంతంగా, సులభంగా రుణాలు పొందడానికి దోహద పడుతోంది. సిబిల్ ర్యాంకు అనేది కంపెనీ క్రెడిట్ రిపోర్టు, గత చెల్లింపుల తీరు తెన్నులు, కంపెనీ భవిష్యత్ చెల్లింపుల సామర్థ్యాన్ని తెలియ జేస్తుంది. రుణదాతలు దీన్ని ప్రాతిపదికగా తీసుకుని బిజినెస్ లోన్‌కు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయించు కోవడానికి, ఒకవేళ రుణం ఇస్తే ఎంత మొత్తం ఇవ్వాలన్నది కూడా డిసైడ్ చేసేందుకు దోహద పడుతుంది.
ఎంఎస్‌ఎంఈలు తమ రుణ అర్హతను పెంచుకోవడానికి వ్యాపార రుణ అవకాశాలను అందిపుచ్చు కోవడానికి సిబిల్ క్రెడిట్ దోహద పడుతుంది. ఎంఎ్‌సఎంఈలు స్వంతంగా ప్రణాళికను రూపొందించు కోవాలి. అంతే కాకుండా అధికారిక రుణ వితరణ సంస్థల నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేగవంతంగా, సులభంగా నిధులను పొందడానికి ప్రత్యామ్నాయ రుణ వనరుల కోసం కూడా ప్రయత్నాలు చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో గ్యారెంటీగా తనఖాను కోరవచ్చు. ఇందుకు విలువైన ఆస్తులను తనఖా పెట్టాల్సి రావచ్చు. ఇలాంటి రుణాలపై అధిక వడ్డీ రేటుకు అవకాశం ఉంటుంది. ఎంత రుణం అవసరం ఉంటుందో అంత మేరకు మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల అప్పుల ఊబిలో పడకుండా బయటపడే అవకాశం లభిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి