ఒప్పుకుంటే ఓకే..లేకపోతే జైలుకే
ఈ దేశంలో ఒకప్పుడు రాజయాల్లో ఒక వెలుగు వెలిగిన అధినాయకులు నిద్ర పోవడం లేదు. ఎప్పుడు ఐటీ, సిబిఐ దాడులు చేస్తుందోనని భయాందోళనకు లోనవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్స్ ను సైతం వదలడం లేదు మోదీ, అమిత్ షాలు. రాబోయే ఎన్నికల్లో సైతం బీజేపీకి ఎదురే లేకుండా చేయాలన్నదే వీరిద్దరి టార్గెట్. అందులో భాగంగానే దేశమంతటా దాడులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు దేశంలో చక్రం తిప్పిన చిదంబరం, కర్ణాటకలో చక్రం తిప్పిన నేతగా పేరున్న డీకే శివకుమార్ లను జైలుకు పంపించారు. ఇవ్వాలో రేపో కాంగ్రెస్ టాపర్స్ అందరినీ బోను ఎక్కించాలని కంకణం కట్టుకున్నారు. ఢిల్లీ హైకోర్టు డీకేకు బెయిలు వెసలుబాటు కల్పించగా చిదంబరం మాత్రం అండమాన్ జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు.
దేశమంతటా ఒకే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మోదీ,షా. ఆయా రాష్ట్రాలలో విపక్షాలు అంటూ లేకుండా చేయడంలో భాగంగా ముఖ్యమైన నేతలను టార్గెట్ చేయడం. వారు పార్టీలో చేరుతారా లేక పాత కేసులు, ఐటి దాడులు, సిబిఐ రంగంలోకి దిగడం మామూలే పోయింది. తాజాగా మరాఠాలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ పై ఇదే ప్రయోగం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోనే అజిత్ బేషరత్తుగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇక పవార్, అజిత్ లు ఇద్దరూ తోడు దొంగలే. వీరిపై అంతులేని కేసులు ఉన్నాయి. అజిత్ పవార్ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వచ్చాయి.
ఎన్సీపీ నేతలపై మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం మొదలుకొని పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయి.1999 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్‌కి అజిత్ పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుని మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుని బట్టి విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్ పవార్‌పై విమర్శలు వచ్చాయి. తన నిర్ణయాలన్నీ సెక్రటరీ స్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా తీసుకున్నవేనని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. 2012 లో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి, తిరిగి నియామకం అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఒక నె లముందు ఎన్సీపీ నేత శరద్ పవార్, అజిత్ పవార్‌లపై ఇతర మనీ ల్యాండరింగ్ కేసులతో పాటు 25 వేల కోట్ల మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంకు కుంభకోణం కేసుని మోపారు. 2010 నవంబర్ 10 నుంచి 2014 సెప్టెంబర్ 26 వరకు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిబంధనలను పాటించకుండా, ఆర్థిక బలాలను పరిగణనలోనికి తీసుకోకుండా చక్కెర ఫ్యాక్టరీలకు విచ్చ లవిడిగా రుణాలివ్వడం ద్వారా జనవరి 1, 2007 నుంచి 2017 డిసెంబర్ 31 మధ్య కాలంలో ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.
ఎంఎస్సీసీ బ్యాంకుల నుంచి కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలకు ఎటువంటి పూచీ లేకుండా రుణాలిచ్చి, ఆ తరువాత వాటిని ఖాయిలాపడ్డ పరిశ్రమలుగా చూపించారన్న ఆరోపణలున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్సీపీ, శివసేనల నేతలు దిలీప్‌రావ్ దేశ్‌ముఖ్, ఇషార్‌లాల్ జైన్, జయంతి పాటిల్, శివాజీ రావ్, ఆనంద్‌రావు. రాజేంద్ర షింఘేన్, మాధవ్ పాటిల్‌లపై ఈడీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంకుల చట్టాలను, ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించిన విషయాన్ని నాబార్డ్ ఆడిట్ రిపోర్టు వెల్లడించింది.
మనీ ల్యాండరింగ్, నేర పూరిత దుష్ప్రవర్తన, కుట్ర, మోస పూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎన్‌సీపీ నాయకుడూ, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్‌ను 2016 మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా ఉండగా 2005లో ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండా, కె.ఎస్.చమాంకర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు కాంట్రాక్టులు కట్టబె ట్టారని భుజ్ బల్ పై ఆరోపణలున్నాయి. మొత్తం మీద విపక్షాల నేతల బలహీనతలే ఇప్పుడు మోదీ, అమిత్ షా లకు బలాలయ్యాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి