యురేనియం ఆందోళనకరం
యురేనియం త్రవ్వకాలపై దేశమంతటా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎంతగా నిరసన తెలిపినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. చాలా చోట్ల జీవ, మానవ , ప్రకృతి విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. ఆయా ప్రాంతాలలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న డోంట్ కేర్ అంటున్నాయి. ప్రజలతో పాటు ప్రజాస్వామిక వాదులు, పార్టీలు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, పర్యావరణ వాదులు మండి పడుతున్నారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీం కోర్ట్ లను సైతం ఆశ్రయించారు.
తాజగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది. అదే నల్లమల అడవి. ఇక్కడ అడవి బిడ్డలు తీవ్ర వ్యతిరేకం వ్యక్తమైంది. ఏపీలో సైతం ఇదివరకే కడపలో ఇచ్చిన అనుమతిని అక్కడి సర్కార్ విరమించుకుంది. అక్కడి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా ఇరు రాష్ట్రాల్లో కొన్ని నెలలపాటు యురేనియంపైనే చర్చ జరిగింది.
యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వ కూడదంటూ ఒక వైపు పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతాయని, పర్యావరణానికి పెను ముప్పు అంటూ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే దేశంలోని భూగర్భ జలాల పరిస్థితిని అధ్యయనం చేసిన అంతర్జాతీయ సంస్థ నివేదిక మరింత ఆందోళనను కలిగిస్తోంది. అమెరికాలోని డ్యూక్ యునివర్సిటీ, కేంద్ర భూగర్భ జల వనరుల సంస్థ సంయుక్తంగా ఇటీవలే దేశంలోని 16 రాష్ట్రాల్లోని 79 జిల్లాల్లో భూగర్భ జలాలను పరిశీలించింది. ఒక లీటరు నీటిలో యురేనియం పరిమాణం 30 ఎంజీ కన్నా తక్కువ ఉంటే సురక్షిత నీరు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది.16 రాష్ట్రాల్లో అధ్యయనం జరపగా, 90 శాతం నమూనాల్లో ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితికి మించి ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.
భూగర్భ జలాల్లో యురేనియం పరిమితికి మించి ఉండటంపై సమాధానం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ కుమారి షెల్జా రాజ్యసభలో ప్రశ్నించారు. హరియాణాలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సిర్సా జిల్లాలో లీటరు భూగర్భ జలాల్లో గరిష్ఠంగా 290 ఎంజీ మేరకు యురేనియం అవశేషాలు ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి నమోదు కావడం విశేషం. యురేనియం ఉన్న జిల్లాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఉండగా, తెలంగాణలోని నల్గొండ ఆరో స్థానంలో నిలిచింది.
ఏపీలోని గుంటూరు, కడప జిల్లాల్లో 695 చోట్ల, తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో 208 చోట్ల ఈ అధ్యయనం జరిగింది. గుంటూరు జిల్లాలోని 11 ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో అత్యధికంగా 2074 ఎంజీ యురేనియం ఉందని తేలింది. దేశంలోనే ఇది అత్యధికం. రెండో స్థానంలో బెంగళూరు నిలిచింది. నల్గొండ జిల్లాలో 84 చోట్ల అధ్యయనం చేయగా 521 ఎంజీ ఉందని తేలింది. హైదరాబాద్‌లో 82 ఎంజీ నమోదు కావడం మరింత ప్రమాదాన్ని సూచిస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి