పోస్ట్‌లు

ఆగస్టు 15, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

డోర్ డెలివరీ చేస్తున్న రోబోస్ - అమెజాన్ సక్సెస్

చిత్రం
మానవుల ప్రమేయం లేకుండానే ప్రపంచంలో పనులు జరిగితే ఎలా ఉంటుందో అని ఆలోచించిన వాళ్లకు షాక్ ఇచ్చేలా చేస్తున్నాయి రోబోస్. ఇప్పటికే లాజిస్టిక్ రంగం లోకి ఇవి ఎంటర్ అయ్యాయి. వీటితో బలమైన పనులే కాదు, స్టోర్స్ , మాల్స్ లలో విరివిగా వాడుతున్నారు. ఇప్పటికింకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేక పోయినప్పటికీ ..ఇది ప్రమాదకర సంకేతంగా భావనిచాల్సి ఉంటుంది. అదేమిటంటే అన్ని కంపెనీలు రోబోలను వాడుతూ పోతే, ఇక సిబ్బంది, ఉద్యోగులు, కార్మికుల అవసరం ఉండదు.  అప్పుడు కోట్లాది మందికి బతికేందుకు కొలువులంటూ ఉండవు. వందలాది మందితో చేసే పనుల్ని ఈ రోబోలు అవలీలగా చేసేస్తున్నాయి. నిన్నటి దాకా స్టోర్స్, మాల్స్ , కంపెనీలకే పరిమితమై పోయిన రోబోలు ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలోని రోడ్లపైకి వచ్చాయి. ఎందుకని అనుకుంటున్నారా లాజిస్టిక్ , ఈ కామర్స్ రంగంలో టాప్ రేంజ్ లో ఉంటున్న అమెజాన్ కంపెనీ ఏకంగా ఈ రోబోలను ప్రాడక్ట్స్ ను బుకింగ్ చేసిన కస్టమర్లకు డెలివరీ చేసేందుకు ఈ రోబోలను వదిలారు. అంతకు ముందు వీటికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. రోడ్ సేఫ్టీ గురించి , ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు.  డెలివరీ చేసే వారి చిరునామాను అక్కడికి నే...

ఆరోగ్యానికి బలం..తల్లి పాలు శ్రేయస్కరం

చిత్రం
ఎల్లలంటూ ఎరుగరు. వాన కురిసినా..ఆకాశంలో నక్షత్రాలు మెరిసినా ..అవి తమ కోసమే అని ఆనందపడుతూ ..ఎలాంటి మాయా మర్మం ఎరుగని పిల్లలంటే ఎంతో ఇష్టపడతాం. ప్రేమిస్తాం. గుండెల్లో హత్తుకుంటాం. మానవ జీవితంలో అరుదైన సన్నివేశం బాల్యం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు సంతోషం వెళ్లి విరుస్తుంది. పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే కావాల్సింది తల్లి ప్రేమ ఒక్కటే కాదు..అంతకంటే పిల్లలకు పాలు ఇవ్వడం. గతంలో కొన్నేళ్ల పాటు పాలు ఇచ్చే సంస్కృతి ఉండేది. ఇప్పుడది మారి పోయింది. తమ అందం ఎక్కడ చెడి పోతుందోనన్న ఆందోళనకు లోనవుతున్న తల్లులు పిల్లలను పట్టించు కోవడం లేదని , వైద్యులతో పాటు యుఎన్ఓ ఆవేదన వ్యక్తం చేసింది. పాలివ్వడం అనేది నేరం కాదని, అది బిడ్డకు తల్లికి మధ్య బంధం బాల పడేందుకు దోహదం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం బిడ్డ పుట్టాక ఆరు నెలలపాటు ఇస్తే బావుంటుందని పేర్కొంటున్నారు. ప్రపంచమంతటా తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి రోగాలు రావని, పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారని ప్రచారం చేయాలని అన్ని దేశాల ప్రభుత్వాలను కోరింది సంస్థ. తల్లి పాలు ఇవ్వని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతు...

వరల్డ్ వైడ్ గా వైరల్ .. బ్రియనా విలియమ్స్ సెన్సేషన్

చిత్రం
ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. ఆ ఒక్కరు ఎవరో కాదు బ్రియనా విలియమ్స్ . ఇప్పుడు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో, తన కథ వైరల్ అవుతోంది. కొద్ది నిమిషాల లోపే దానిని లక్షలాది మంది చూశారు..పెద్ద ఎత్తున స్పందించారు. ఆమె సాధించింది ఏమిటంటే అసాధారణ విజయం. ఆమె సింగిల్ మదర్. కుటుంబ సమస్యలు ఆమెను కుదురుగా ఉండనీయ లేదు. ఓ వైపు పిల్లాడు, ఇంకో వైపు బతుకు భారం. మానసికంగా చితికి పోయింది . కానీ బ్రియనా మాత్రం చదువు కోవడం మాత్రం ఆపలేదు. ప్రపంచంలోనే పేరు పొందిన హార్వర్డ్ యూనివర్సిటీ లో చోటు సంపాదించారు. అక్కడ న్యాయ శత్ర విభాగంలో ప్రత్యేకించి లా కోర్సు ను ఎంచుకున్నారు. ఇదే సమయంలో ఆమె కోర్టుకు వ్యక్తిగత సమస్య కారణంగా హాజరు కావాల్సి వచ్చింది. విలియమ్స్ కు అప్పుడే పరీక్షలు. తనకు రాసేందుకు అవకాశం ఇవ్వమని వేడుకుంది. ఆమె విన్నపాన్ని మన్నించింది అక్కడి కోర్ట్. కన్నీళ్లను దిగమింగుకుని బ్రియాన్ లా పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది . సక్సెస్ ఫుల్ గా న్యాయ విద్యను పూర్తి చేసింది. లా పట్టా పొందింది. ఆమెకు ఇప్పుడు 24 ఏళ్ళు. జ్యురీస్ డాక్టర్ డిగ్రీ సంపాదించింది విలియమ్స్. కొన్ని ...

రోజుల్లో కానిది..గంటల్లో అవుతుందా..?

చిత్రం
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆఘమేఘాల మీద ఎందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారో వివరాలు సమర్పించమంటూ రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది. 109 రోజులు సమయం అడిగిన మీరు కేవలం 24 గంటల్లో ఎన్నికలు ఎలా జరుపుతారంటూ డివిజన్ బెంచ్ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వం ఆఘ మేఘాల మీద పురపాలికల ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నం చేస్తోందని, దీని వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ఒరిగేది ఏమీ ఉండదని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణలోని పట్టణాలను అశాస్త్రీయంగా విభజించారని, మార్పులు చేశారని ఆరోపణలు చేశారు. మున్సిపోల్స్ ప్రక్రియను కేవలం ఎనిమిది రోజుల్లో ఎలా పూర్తి చేయాలనీ అనుకుంటున్నారో అర్థం కావడం లేదని బెంచ్ పేర్కొంది. ఎన్నికలు జరిపేందుకు మూడు నెలలకు పైగా టైం పడుతుందని చెప్పిన సర్కార్ ఆఘమేఘాల మీద ఇలా పేర్కొనడం భావ్యం కాదన్నారు. మీరు తెలిపినట్టు, నిజమే నాలుగు నెలల పనిని మూడు నెలల్లో చేస్తే ఏమీ కాదు ..కానీ నెల రోజుల లోపే చేస్తేనే అనుమానం వస్తుంది. వార్డుల విభజనకు 32 రోజులు , ఎస్సీ , ఎస్టీ , బీసీ , మహిళా ఓటర్ల గుర్తింపు కోసం 28 రోజులు , వార్డుల ఖరారుకు 7 రోజులు , చైర్మ...

భళారే..అయ్యారే..అయ్యర్..కోహ్లీ కితాబు..!

చిత్రం
కష్టాల్లో ఉన్నప్పుడు గోడలా నిల్చున్న వాడే నిజమైన హీరో. యుద్ధం లో కానీ, ఏ ఆటలో కానీ విజయ తీరాలకు తీసుకు వెళ్లే వారినే అభిమానులు ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటారు. అలాంటి వారిలో టీమిండియాలో మహమ్మద్ అజారుద్దీన్ , రాహుల్ ద్రవిడ్ లాంటి ఆటగాళ్లు ఎందరో తమ ప్రతిభా పాటవాలతో గట్టెక్కించారు. మరిచి పోలేని విజయాలు అందించారు. భారత జట్టు ప్రపంచ కప్ హాట్ ఫెవరెట్ గా ఉన్నా సెమీ ఫైనల్ లో ఒడి పోయింది . దీంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కోహ్లీ సారధ్య బాధ్యతలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆటగాడిగా రాణించినా జట్టుకు విజయాలు అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో పలువురు సీనియర్లు సైతం అతడిని తప్పు పట్టారు. ధోని క్రీజ్ లో ఉన్నప్పటికీ సరిగ్గా ఆడలేదంటూ ఫ్యాన్స్ మంది పడ్డారు. ఈ సమయంలో బీసీసీఐ ఎంపిక కమిటీ తీరుపై దేశమంతటా ఆగ్రహం వ్యక్తమైంది . జట్టు ఎంపికలో పారదర్శకత పాటించ లేదని , జట్టు ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఆటను ప్రదర్శించ లేదని మంది పడ్డారు . జట్టు ఆడే సమయంలో నాలుగో ప్లేస్ అతి ముఖ్యమైనది. ఓపెనర్లు ఫెయిల్ అవుతే జట్టును ఆదు కోవడంతో పాటు ముందుండి నడిపించే భాద్యత ఈ స్థ...

పండు వెన్నెల్లో సమీరం..త్రివిక్రం..!

చిత్రం
తెలుగు సినిమాకు దక్కిన అరుదైన వ్యక్తి..శక్తి..స్ఫూర్తి..త్రివిక్రం శ్రీనివాస్. జీవితం అంటే ఏమిటో, దానిని ఎలా ఒడిసి పట్టు కోవాలో ఈ దిగ్గజ దర్శకుడికి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. లైఫ్ సాఫీగా సాగి పోవాలంటే కమ్యూనికేషన్ ముఖ్యం. ఇందులో మాటలు మరింత బలాన్ని ఇస్తాయి. గుండెకు ఆక్సిజన్ లాగా పని చేస్తాయి. నిరాశకు లోనైన వాళ్ళు, బతుకును కోల్పోతున్న వాళ్ళు ..అపజయపు ఊబిలో కొట్టు మిట్టాడుతున్న వాళ్ళు , రాస్తాలో దారి తెలియని వాళ్ళు, కార్పొరేట్ కంపెనీలను ఎలా విజయవంతంగా నడపాలో తెలియక కొట్టుకు చేస్తున్న వాళ్లకు త్రివిక్రం డైలాగ్స్ టానిక్ లాగా పనిచేస్తాయి. హృదయ కవాటాలకు యెనలేని ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే అతడంటే వేలాది మందికి అభిమానం. చెప్పలేనంత పిచ్చి.  ఏది ఆచరిస్తామో అదే అతడి మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. కొందరు తమ గోడల మీద , ఇంకొందరు తమ మెడల్లో చిప్ లాగా దాచుకుంటారు. ఒకే మూస ధోరణిలో ప్రయాణం చేస్తున్న తెలుగు సినిమాకు త్రివిక్రం కొత్త రక్తాన్ని ఎక్కించాడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసే నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ ఇచ్చే డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకులంతా ప్రొడ్యూసర్...

సమాచార విప్లవం ..సామాజిక చైతన్యం..రాకేష్ రెడ్డి ఓ ఆయుధం..!

చిత్రం
ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో పెను సంచలం సమాచార హక్కు చట్టం. 2005 లో ఎప్పడైతే అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి ఇండియా వ్యాప్తంగా సామాజిక వేత్తలు, ఆర్టీఐ కార్యకర్తలు, ప్రజాస్వామిక వేత్తలు, కవులు , కళాకారులు, నిబద్దత కలిగిన జర్నలిస్టులు కోట్లాది ప్రజలను ఈ చట్టం గురించి చైతన్యం చేయడంలో నిమగ్నమయ్యారు. మరికొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా స్వచ్చందంగా పని చేస్తున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తున్నాడు తెలంగాణ ప్రాంతంలోని  వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ రెడ్డి . పారదర్శక పాలన తో పాటు, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పనిచేస్తున్న వారిలో జవాబుదారీతనం ఉండాలని కొన్నేళ్ల నుంచి పోరాడుతున్నారు. జనాన్ని, సమాజాన్ని చైతన్యం చేయాలంటే చాలా శక్తి ఉండాలి . అంతకంటే నిబద్దత కావాలి. మరింత బలంతో పాటు బలగం కూడా కావాలి. తానే ఒక అడుగు ముందుకు వేశాడు రాకేష్ రెడ్డి. అదే ఇప్పుడు వేళా అడుగులు పడేలా చేసింది. ఈ చట్టమే కాదు దేశ వ్యాప్తంగా అటు కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు , మంజూరైన నిధులతో పాటు సమాచార కమిషన్ ఎలా పని చేయవచ్చో అవగాహన కల్పిస్తున్నారు . అంతే కాకుండా ఆయన...

ఫుడ్ సర్వీసెస్ లో దూసుకెళుతున్న జొమాటో

చిత్రం
మన దేశంలోని యువత అమెరికా జపం చేస్తుంటే,  యుఎస్ కు చెందిన దిగ్గజ కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి. ఎన్నడో లేనంతగా ఈ కామర్స్ రంగం రోజు రోజుకు విస్తరిస్తోంది. డాలర్ల పంట పండిస్తోంది. అమెజాన్ , వాల్ మార్ట్ , తదితర కంపెనీలన్నీ భారత్ దేశంలోనే కాసులు కొల్లగొట్టొచ్చంటూ దీనికే ప్రయారిటీ ఇస్తున్నాయి. మన ప్రబుద్ధులు మాత్రం దినమంతా అమెరికా అంటూ పలవరిస్తున్నారు . జనాభా అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వీరి అవసరాలకు సరిపడా వస్తువులు, తిండి క్విన్టరం లెక్కన కావాల్సి వస్తుంది .అన్నిటికంటే లాజిస్ట్ రంగం ఇప్పుడు కోట్లు కుమ్మరించేలా చేస్తోంది. విస్తరిస్తున్న సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసు కోవడంతో ఈ రంగంలో స్టార్తప్ లు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.  వీటిలో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని ప్రారంభంలోనే నిలిచి పోయాయి. ఫుడ్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. నగరం విస్తరించడం, ఉద్యోగ రీత్యా, వ్యాపార పరంగా ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లడం తో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ప్రజల అవసరాలు పెరిగాయి. ఐటి రంగం లో భారీ వేతనాలు పొందడం కూడా మార్కెట్ లో కనీస అవసరాలు తీర్చుకునేందుకు వినియోగదారులు భారీగా ఖర్చు...

పోటీ పడాలంటే ..మనం మారాలంతే..?

చిత్రం
ప్రపంచంలో మనదైన ముద్ర అంటూ లేకపోతే ఎలా..? ఒకరితో పోటీ పడాలన్నా..అందరికంటే ముందు ఉండాలన్నా కావాల్సింది కష్టపడాలి. అన్నిటికంటే మనం మారాలి. మహిళలమన్న భావన నుండి బయట పడాలి. లేకపోతే మనం వున్నా చోటనే వుండి పోతాం అంటోంది సోయగాల నటీమణి ప్రియాంక చోప్రా. ప్రతి రంగంలో పోటీ అన్నది సర్వ సాధారణం. అలాగని భయపడుతూ కూర్చుంటే ఎలా అంటోంది ఈ అమ్మడు . ఉన్నది ఒక్కటే జిందగీ. పొద్దస్త మానం దీని గురించే ఆలోచిస్తూ కూర్చోవడం కంటే, టైం ను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తే అద్భుతంగా రాణించవచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు ..ఇంకొకరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉన్నాయి. సమాజంలో కొందరే గొప్ప వారనుకుని మీ సున్నితమైన మనసుల్ని ఎందుకు పాడు చేసుకుంటారని ప్రశ్నిస్తోంది చోప్రా. సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు ఉంది . దానిని కాపాడు కోవడమే మనల్ని మనం మరింత బలోపేతం చేసు కోవడం . ప్రతి ఒక్కరం మగాళ్లు మారాలని కోరుకుంటారు. అసలు ముందు మహిళలమైన ..అమ్మాయిలమైన మనం ఎందుకు మారాలని అను కోవడం లేదు . సినిమా రంగంలో ప్రతిసారి నన్ను అడుగుతుంటారు..మీకు ఎవరితో పోటీ అని. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇది సిల్లీ క్వచ్చన్. మగాళ్లు, ఆడవ...